IPL Betting : జనం సొమ్ముతో పోస్టుమాస్టర్ ఐపీఎల్ బెట్టింగ్-కోటి రూపాయల స్వాహా | IPL Betting

IPL Betting : జనం సొమ్ముతో పోస్టుమాస్టర్ ఐపీఎల్ బెట్టింగ్-కోటి రూపాయల స్వాహా

ప్రజలకు క్రికెట్ అంటే యమ క్రేజ్. దానిమీది ఉన్నఇంట్రెస్ట్ తో ఆఫీసుకు సెలవు పెట్టుకుని కూడా మ్యాచ్ చూసే అభిమానులు ఉన్నారు. క్రికెట్ మీద బెట్టింగ్ కట్టే వాళ్లు ఉన్నారు.

IPL Betting : జనం సొమ్ముతో పోస్టుమాస్టర్ ఐపీఎల్ బెట్టింగ్-కోటి రూపాయల స్వాహా

IPL Betting :  ప్రజలకు క్రికెట్ అంటే యమ క్రేజ్. దానిమీది ఉన్నఇంట్రెస్ట్ తో ఆఫీసుకు సెలవు పెట్టుకుని కూడా మ్యాచ్ చూసే అభిమానులు ఉన్నారు. క్రికెట్ మీద బెట్టింగ్ కట్టే వాళ్లు ఉన్నారు. అందులో లాభాలు వస్తే పర్వాలేదు..రాకపోతే ఆ నష్టాలు భరించటం చాలా కష్టం. జనం సొమ్ముతో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కట్టిన ఒక పోస్ట్‌మాస్టర్ దానిలో తీవ్రనష్టాలు రావటంతో ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బీనా పోస్టు‌మాస్టర్ విశాల్ అహిర్వార్ కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. మ్యాచ్ చూసి ఆనందించకుండా దానిపై బెట్టింగ్‌లు కాయటం మొదలెట్టాడు. కొన్నాళ్లుగా  జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌లు పెడుతున్నాడు. ఈక్రమంలో దాదాపు కోటి రూపాయలకు పైనే నష్టపోయాడు. ఇటీవల ఆ విషయం బయటకు పొక్కింది. అయితే ఆ సొమ్మంతా ప్రజల సొమ్మని తేలింది.

విశాల్ చేసిన మోసం వెలుగులోకి రావటంతో మే 20న బినా గవర్నమెంట్ రైల్వే పోలీసుల అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన తప్పు ఒప్పుకున్నాడు. పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సుమారు 24 కుటుంబాలకు చెందిన  సొమ్మును ఐపీఎల్ బెట్టింగ్ లో పెట్టి నష్టపోయినట్లు పోలీసులు కనుగొన్నారు.

నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల కోసం విశాల్ నిజమైన పాస్ బుక్ లు జారీ చేసినట్లు గుర్తించారు. గత రెండేళ్లుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినట్లు నేరం ఒప్పుకున్నాడు. విశాల్ మీద ఐపీసీ సెక్షన్ 420,408 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Red Sanders : ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్-22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

×