Red Sanders : ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్-22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు.

Red Sanders : ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్-22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

Red Sanders

Red Sanders :  చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ …ఇందుకు సంబంధించి ఐదుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేశామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారుల మంగళవారం నుంచి వివిధ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.

తిరుపతి డివిజన్ బాలపలి రేంజ్ లో కొంతమంది అనుమానాస్పదంగా కనిపించిన వారిని సమీపించగా, వారు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. వారిని రైల్వే కోడూరు బుడుగుంటపల్లికి చెందిన సేమూరి శంకరయ్య (27), దాదినేని వేమయ్య (46),పొన్నాల రవిశంకర్ (33)లగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఐదు ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో తిరుమల పాపనాశనం నుంచి అన్నదమ్ముల బండ వద్ద మూడు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తుండగా వారిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు పట్టుబడగా, అతన్ని తమిళనాడు జమునామత్తూరుకు  చెందిన కె. రాజేంద్రన్ (40)గా గుర్తించారు. అతని నుంచి మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

మూడవ కేసులో బాలపల్లి రేంజ్ లో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తుండగా చుట్టుముట్టారు. వారిలో ఒకడు పట్టుబడగా అతనిని రైల్వే కోడూరు కు చెందిన హరిగా గుర్తించారు. ఇతను అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో 14 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. మూడు సంఘటనలలో 22 దుంగలు పట్టుబడగా మొత్తం 480 కిలోలు ఉన్నాయని, వీటివిలువ రూ.45 లక్షలు విలువ ఉండవచ్చునని ఎస్పీ తెలిపారు.

Also Read : Drugs Case : డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ కొడుకు అరెస్ట్