నేరాలు – ఘోరాల్లో సంచలనం : సీరియల్ కిల్లర్ నేరాలు చూస్తే షాక్ తింటారు

  • Published By: madhu ,Published On : December 28, 2019 / 10:00 AM IST
నేరాలు – ఘోరాల్లో సంచలనం : సీరియల్ కిల్లర్ నేరాలు చూస్తే షాక్ తింటారు

నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు.

ఒక్కరు కాదు..ఇద్దరు కాదు : –
అవును..ఒకరిని కాదు..ఇద్దరు కాదు..ముగ్గురు కాదు..ఏకంగా 16 మంది మహిళలను చంపేశాడు ఆ దుర్మార్గుడు. సొంత తమ్ముడిని కూడా కాటికి పంపాడు. తన నటనతో పోలీసులను నమ్మించి..జైలు నుంచి బయటకు వచ్చి..ఈ దారుణాలకు పాల్పడడం గమనార్హం. 

షాక్ తిన్న పోలీసులు : – 
ఒళ్లు గుగురుపొడిచే విధంగా ఉన్న ఇతని మర్డర్ హిస్టరీ తెలుసుకున్న ప్రజలు సమాజంలో ఇలాటి వారు ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇతను ఎలాంటి వాడు, ఎలాంటి నేరాలు చేశాడు, ఎక్కడి వాడు తదితర సమాచారం కోసం నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. 

మహిళల హత్యల కలకలం : –
మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌..ఇలా కొన్ని  ప్రాంతాల్లో జరిగిన మహిళల హత్యలు కలకలం రేపాయి. వీరిని ఎవరు చంపుతున్నారు ? ఎందుకు మర్డర్ చేస్తున్నారు ? అనేది పోలీసులకు అర్థం కాలేదు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కానీ ఫలితం శూన్యం. ఎక్కడా ఆధారాలు దొరకడం లేదు. జనాల మధ్య తిరుగుతున్న ఈ నర హంతకుడు కోసం పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు.

షాకింగ్ నిజాలు : – 
ఈ క్రమంలో..నవాబు పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ దారుణ హత్యకు గురైంది. ఇందులో ఎరుకుల శ్రీను పాత్ర తెరపైకి వచ్చింది. వెంటనే ఇతడిని పట్టుకుని విచారించారు. దర్యాప్తుల్లో షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. పలు ప్రాంతాల్లో మహిళలను దారుణంగా చంపింది ఇతనే అని నిర్ధారించారు. అతనే…మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకుల శ్రీను.

నేర చరిత్ర : – 
2007లో సొంత తమ్ముడిని చంపేశాడు. దీంతో ఇతడిని పోలీసులు జైలుకు పంపారు. మంచిగా ఉంటా..బతుకుతా..అంటూ పరివర్తన కింద అప్పీల్ చేసుకున్నాడు. పాపం పోనీలే..అని మూడేళ్ల తరువాత బయటకు వదిలారు. కేవలం అతను నటించాడని పోలీసులకు తెలియదు. తనలో మార్పు రాలేదని మరలా హత్యలు చేయడం ప్రారంభించాడు. నగలు, ఆభరణాలు ధరించిన మహిళలను టార్గెట్ చేశాడు. కల్లు, మద్యాన్ని త్రాగించి..దారుణంగా చంపేశాడు. తనలో క్రూరత్వం ఇంకా చనిపోలేదని నిరూపించాడు. మరలా ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు.

జైలుకు వెళ్లి వచ్చినా : – 
ఇతనిలో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ ప్రయత్నించింది. పెట్రోల్ బంకుల్లో పని చేయాలని సూచించారు. కానీ పనులకు సరిగ్గా హాజరు కాలేదు. దీంతో అతడిని విధుల నుంచి తొలగించారు. మరలా తనలో ఉన్న నటనను బయటకు తీశాడు. పోలీసు అధికారులను నమ్మబలికే విధంగా చేశాడు. చివరకు పెట్రోల్ బంకుల్లో పనికి కుదిరాడు. 2018 ఆగస్టులో జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు.

దిమ్మదిరిగే నేరాలు : – 
ఈ క్రమంలో…డిసెంబర్ 16వ తేదీన మహబూబ్ నగర్‌లో అలివేలమ్మ దారుణ హత్యకు గురైంది. పోలీసుల విచారణలో ఎరుకుల శ్రీను పాత్ర ఉన్నట్లు తేల్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తాను..మంచిగా బతుకుతున్నానని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి ఇతని నటనను నమ్మలేదు. విచారించారు. దిమ్మదిరిగే నేరాలు ఒక్కోక్కటిగా బయటకు చెప్పాడు. ఏకంగా 16 మంది మహిళలను మట్టుబెట్టినట్లు ఒప్పుకున్నాడు. 2018 నుంచి నమోదైన కేసులు 4, పాతవి 14 కేసులు కలిపి ఇతనపై 18 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో 17 హత్యలు ఉన్నాయి. 

* 2007 తుమ్మాజిపేట హత్య కేసులో జీవిత ఖైదు, సత్ప్రవర్తన కింద విడుదల
* 2007 బాలానగర్‌, నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల పరిధిలో ఒక్కో కేసు
* 2007 జైలు నుంచి పారిపోయిన కేసు
* 2014 వంగూరు మర్డర్‌ కేసులో మూడేళ్ల జైలు శిక్ష
 

* 2014 షాద్‌నగర్‌, బాలానగర్‌ హత్య కేసుల్లో నిందితుడు
* 2015 శంషాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో 3 కేసులు
* 2015 షాద్‌నగర్‌, కేశంపేట పీఎస్‌లలో ఒక్కో కేసు
* 2018 నాలుగు హత్య కేసుల్లో నిందితుడు

Read More : ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో నివ్వెరపోయే నిజాలు