Software Suicide: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.

Software Suicide: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Crime

Software Suicide: హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో దారుణ ఘటన వెలుగు చూసింది. వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు చెందిన స్మృతి రేఖా ఫరీదా(26) అనే యువతీ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. గౌలిదొడ్డిలోని ఓ పీజీ హాస్టల్లో రేఖా ఫరీదా నివాసముంటుంది. ఈక్రమంలో సోమవారం నాడు తోటి ఉద్యోగి..జాన్ కు ఫోన్ చేసిన రేఖా ఫరీదా.. తనకు బతకాలని లేదని బాధపడుతూ చెప్పింది. అనంతరం తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని హాత్మహత్యకు పాల్పడింది.

Also Read: Warangal : రైలు కింద పడిన మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌

ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. హాస్టల్ కు చేరుకొని రేఖా ఫరీదా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతీ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. యువతీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గత కొంత కాలంగా రేఖా ఫరీదాను ఎవరో వేదిస్తున్నట్టు పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. ఈ క్రమంలో యువతీ సెల్ ఫోన్ లోని కాల్ డేటా, వాట్సాప్ చాట్, తదితర వివరాలు సేకరించి పోలీసులు విచారిస్తున్నారు.

Also read: Gang Attack : హోటల్‌పై రౌడీల దాడి-దౌర్జన్యంగా నగదు ఎత్తుకెళ్లిన గ్యాంగ్