Poisoned Cold Drink: స్కూల్లో విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. తాగిన బాలుడు ఆస్పత్రిలో మృతి

అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేందుకు ఉదాహరణ తాజా ఘటన. తెలియని వ్యక్తి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన ఆరో తరగతి బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Poisoned Cold Drink: స్కూల్లో విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. తాగిన బాలుడు ఆస్పత్రిలో మృతి

Poisoned Cold Drink: తమిళనాడులో దారుణం జరిగింది. స్కూల్లో విషం కలిపిన కూల్ డ్రింక్ తాగిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు, కన్యాకుమారికి చెందిన అశ్విన్ (11) అనే బాలుడు స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

20 రోజుల క్రితం బాలుడికి స్కూల్ దగ్గర గుర్తు తెలియని ఒక వ్యక్తి కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత సాయంత్రం ఎప్పట్లాగే ఇంటికి చేరుకున్నాడు. కానీ, అప్పటికే బాలుడికి కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాడు. అక్కడ బాలుడు తనకు గుర్తు తెలియని వ్యక్తి స్కూలు దగ్గర కూల్ డ్రింక్ ఇచ్చినట్లు చెప్పాడు. కాగా, బాలుడికి పరీక్షలు జరిపిన వైద్యులు నిర్ఘాంత పోయారు. ఆ కూల్ డ్రింకులో యాసిడ్ శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాలుడి శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయి. యాసిడ్ ప్రభావానికి బాలుడి కడుపు, గొంతు, కిడ్నీలుసహా లోపలి అవయవాలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో బాలుడి పరిస్థితి విషమించింది. అతడ్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Minor Girl: మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం.. ఒకే ఇంట్లో ఉంటున్న బాలిక, నిందితుడు

దాదాపు 20 రోజులు చికిత్స పొందిన బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాలుడికి విషం ఇచ్చిన వ్యక్తిని పట్టుకుని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ విచారణను సీబీసీఐడీకి అప్పగించింది. బాలుడికి విషం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కొద్ది రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నప్పటికీ ఇంకా అతడ్ని గుర్తించలేకపోయారు.