ప్రేమని పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్య

ప్రేమని పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్య

Teenage Girl, Lover emds life In Odisha’s Malkangiri : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని భయపడిన ప్రేమికులు పెళ్లి చేసుకుని తనువు చాలించిన ఘటన ఒడిషాలోని మల్కన్ గిరి జిల్లాలో జరిగింది. మల్కన్ గిరి సమీపంలోని ఎంవీ-42 గ్రామానికి చెందిన బిక్కి సుఖ్ దర్, అదే గ్రామానికి చెందిన సోరిత సర్కార్ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబీకులకు తెలిసి వారిని మందలించారు. వీరి ప్రేమను ఒప్పుకోలేదు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదు కాబట్టి ఇక జీవితంలో కలిసి జీవించలేమని భావించారు.

డిసెంబర్ 30 బుధవారం రాత్రి ఇళ్లలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటినుంచి పారి పోయారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గ్రామానికి తిరుగు ప్రయాణ మయ్యారు. జంటగా ఇంటికి వెళితే ఇంట్లోవాళ్లు ఒప్పుకోరమోనని భయం వేసి ఊరి చివరి దేవాలయం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం అటువైపు వచ్చిన గ్రామస్తులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.