Thieves : వీళ్లు మాములు దొంగలు కాదు.. ఒకడు టీవీఎస్ దొంగిలిస్తే.. మరొకడు సీసీ కెమెరాలనే ఎత్తుకెళ్లాడు
నేరాలు నివారించేందుకు పెట్టిన సీసీ కెమెరాలనే తస్కరించాడో దొంగ.. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది

Thieves
Thieves : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సీసీ కెమెరాలే (CC Camera) కనిపిస్తున్నాయి. నేరాలను నివారించడానికి, రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి సీసీ కెమెరా ఫుటేజీ కీలకంగా ఉంటుంది. దొంగతనాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
చదవండి : Thieves love story : ఇద్దరు దొంగల లవ్ స్టోరీ.. వీళ్ల స్కెచ్‌లు అంతకు మించి
దొంగలను పట్టించే సీసీ కెమెరాలనే దొంగిలించాడో దొంగ.. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం (Khammam) సీమా ఫర్నీచర్ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు.. తాను పనిచేస్తున్న షాప్‌తో పాటు పక్కనే ఉన్న మరో 8 షాపుల ముందు పెట్టిన సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లాడు. షాప్ యజమానులిచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫుటేజీ ఆధారంగా అతడు షాప్‌లో పనిచేస్తున్న యువకుడే అని గుర్తించారు పోలీసులు. యువకుడి కోసం గాలింపు చేపట్టారు.
చదవండి : Thieves Attack : నవ దంపతులపై దాడి..మంగళ సూత్రం, గొలుసు ఎత్తుకెళ్ళిన దుండగులు
ఇక ఇదిలా ఉంటే.. నిర్మల్ (Nirmal)జిల్లాలో బైక్ చోరీలు పెరిగిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పొలాల వద్ద పెట్టిన బైక్ లను కూడా చాకచక్యంగా తస్కరిస్తున్నారు దొంగలు. తాజాగా లోకేశ్వరం మండలం కనకపూర్ గ్రామంలో రెండు టీవీఎస్ ఎక్స్ ఎల్ (tvs XL Vehicle) వాహనాలను చోరీ చేశారు. ఐతే ఓ వాహనాన్ని దొంగిలించి తీసుకెళుతూ సీసీ కెమెరాలో చిక్కాడు ఓ దొంగ. ఆ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.