Sextortion gang: వెబ్‌సైట్‌లో నగ్నంగా వీడియో కాల్స్‌..! 200మంది నుంచి రూ.22కోట్లు దోచేసిన జంట

ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసే ముఠా గుట్టు రట్టయ్యింది.

Sextortion gang: వెబ్‌సైట్‌లో నగ్నంగా వీడియో కాల్స్‌..! 200మంది నుంచి రూ.22కోట్లు దోచేసిన జంట

Kiladi Lady

Sextortion gang: ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసే ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ ముఠాలో ప్రమేయం ఉన్న భార్యాభర్తలు, ముగ్గురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, చెక్ బుక్‌లు, పాస్‌పుస్తకాలు, పాస్‌పోర్టులు, 3 ఏటీఎం కార్డులు, 3 పాన్ కార్డులు, 6 వెబ్ కెమెరాలు, 6 ల్యాప్‌టాప్‌లు, వెండి, రూ.8,000 నగదు, మహిళల అండర్‌గార్మెంట్‌లు, పెద్ద మొత్తంలో అభ్యంతరకర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ జంట అమ్మాయిలను పనిలో పెట్టుకుని బ్లాక్‌మెయిలర్‌ ముఠాను నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నిందితుల్లో యోగేష్ గౌతమ్, అతని భార్య సప్న, నికిత, నిధి, ప్రియ ఉన్నారు. నిందితులంతా ఘజియాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. నిందితులంతా 12వ తరగతి ఉత్తీర్ణులని నగర ఎస్పీ తెలిపారు. యోగేష్, అతని భార్య సప్నా మొత్తం ముఠాను నిర్వహించేవారని చెబుతున్నారు పోలీసులు.

గ్యాంగ్ లీడర్ యోగేష్ అమ్మాయిలకు వీడియో కాలింగ్ చేయడానికి స్థలాన్ని ఏర్పాటు చేసేవాడని, నగర ఎస్పీ భార్య నిపున్ అగర్వాల్ వెల్లడించారు. వారి బ్యాంకు అకౌంట్లు, కాల్ రికార్డింగ్‌లు.. అసభ్యకరమైన భాషకు సంబంధించిన ఆడియోలు సీజ్ చేశారు. యోగేష్ భార్య సప్నా పోర్న్ వెబ్‌సైట్ స్ట్రిప్‌చాట్.కామ్‌లో ఐడిని సృష్టించి కస్టమర్లను బుక్ చేసేది. మిగతా ముగ్గురు అమ్మాయిలు వ్యక్తులకు వీడియో కాల్స్ చేసి స్క్రీన్ సేవర్ లేదా వేరే మొబైల్ ఫోన్‌తో వారి న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసేవారు.

న్యూడ్ వీడియోల్లో మాట్లాడిన అమ్మాయిలకు నెలలకు రూ. 25వేలను యోగేష్ ఇచ్చేవాడు. తర్వాత న్యూడ్ వీడియోల్లో మాట్లాడిన వ్యక్తులను ముఠా సభ్యులు బ్లాక్ మెయిల్ చేసేవారు. అశ్లీల వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. మరికొందరు యువతులు కూడా ఇదే ముఠాలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

సప్నానే కేడి లేడీ! :
ఐదేళ్ల క్రితం సప్నా పెళ్లి కాకముందే, డీయూలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువు మానేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ ఇంటర్నెట్‌లో ఉద్యోగాలు వెతుకుతూ ఉండేది. ఆ సమయంలోనే ఆస్ట్రేలియాలో ఉంటున్న సన్నీ అనే భారతీయ సంతతికి చెందిన యువకుడితో ఫేస్‌బుక్‌లో స్నేహం ఏర్పడింది. సప్నా కూడా వర్క్ విషయంలో సన్నీతో మాట్లాడేది. ఆ సమయంలో సన్నీనే సప్నాకు ఈ ఆలోచన ఇచ్చారు. ఈజీ మనీకి అలవాటుపడిన సప్నా.. బ్లాక్ మెయిలింగ్ వ్యాపారానికి సంబంధించిన చిట్కాలు తెలుసుకుంది. ఆ తర్వాత సప్నా మొదట పోర్న్ వెబ్‌సైట్ స్ట్రిప్‌చాట్.కామ్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి పాస్‌పోర్ట్‌ను పొందింది. ఆపై వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంది. తర్వాత న్యూడ్‌ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది.

పెళ్లి చేసుకున్న తర్వాతే.. అదే వ్యాపారంగా:

కాలేజ్‌లో తన స్నేహితుడిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సప్నా.. పెళ్లయ్యాక కూడా ఉద్యోగం పేరుతో నోయిడాలో ఓ గదిని తీసుకుని అమాయకులకు వీడియో కాల్స్ చేస్తూ న్యూడ్ వీడియోలు చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది. భారీగా డబ్బులు వస్తూ ఉండడంతో భర్త యోగేష్‌కి అనుమానం వచ్చి అడగగా.. సప్నా అసలు విషయాన్ని యోగేష్‌కి చెప్పింది. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వస్తున్నారు.

స్ట్రిప్‌చాట్.కామ్ వెబ్‌సైట్‌లో అమ్మాయిలకు వీడియో కాల్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించినందుకు నిమిషానికి రూ.234 చెల్లించాలి. వీడియో కాల్‌లో, అమ్మాయిలు సెక్సీ డ్రెస్‌లు వేసుకుని వచ్చేవారిని ఎట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. నిందితులు సొసైటీలోని రెండు ఫ్లాట్లను 8-8 వేల రూపాయలకు అద్దెకు తీసుకుని వ్యాపారం చేసినట్లు తెలిపారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా షిఫ్టింగ్‌లు ప్రకారం కూడా అమ్మాయిలు వీడియో కాలింగ్ చేసి మగవాళ్లను వలలలో వేసుకునేదారు.

అసలు విషయం వెలుగులోకి ఎలా వచ్చిందంటే?
రాజ్‌కోట్‌లో ఓ కంపెనీ యజమాని తన అకౌంటెంట్‌పై రూ.90లక్షల దొంగతనం కేసు పెట్టాడు. ఈ విషయంపై గుజరాత్ పోలీసులు దర్యాప్తు చేయగా, ఘజియాబాద్ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్లు తేలింది. పోలీసులు అక్కడ తీగ లాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ సభ్యులు తన న్యూడ్ వీడియోను తీశారని, గత మూడేళ్లుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అకౌంటెంట్ పోలీసులకు వెల్లడించాడు. కంపెనీ సొమ్మును వారి అకౌంట్‌కు అకౌంటెంట్ బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరు ఈ విధంగా మోసం చేసి ఇప్పటివరకు వేరు వేరు వ్యక్తుల నుంచి రూ. 22కోట్ల వరకు దోచుకున్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత ఆ అంకె పెరగొచ్చునని చెబుతున్నారు. అయితే, ఎవరూ కూడా వీరిపై ఎక్కడా కంప్లైంట్ ఇవ్వకపోవడం గమనార్హం.