Encounter : తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో ఎన్‌కౌంటర్-10 మంది మావోయిస్టులు మృతి

తెలంగాణ, చత్తీస్‌గఢ్  సరిహద్దులో...ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.

Encounter : తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో ఎన్‌కౌంటర్-10 మంది మావోయిస్టులు మృతి

encounter

Encounter :  తెలంగాణ, చత్తీస్‌గఢ్  సరిహద్దులో…ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఒక జవాను గాయపడ్డాడు. తెలంగాణలోని మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ కొనసాగుతోంది.

ములుగు జిల్లా వాజేడు. వెంకటాపురంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల దుమ్ముగూడెం, ఏరియా కమిటీ నేతల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.  మావోయిస్టుల సంచారానికి సంబంధించి పోలీసులకు కీలక సమాచారం అందుతోంది.  సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు  కూంబింగ్ వేగవంతం చేస్తున్నారు. చత్తీస్‌గఢ్ బోర్డర్ లో తెలంగాణ   పోలీలుసు చత్తీస్‌గఢ్ పోలీసులతో కలిసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.ఈ రోజు ఉదయం కూంబింగ్ చేపట్టిన పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల  మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. నలుగురు మావోయస్టులు మరణించారు.   ఈ ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల్లో   ఏటూరి నాగారం  మహదేవ్ పూర్ ఏరియా కమిటీ సెక్రటరీ సుధాకర్ ఉన్నట్లు గుర్తించారు.

Also Read :Army New Uniform : ఆర్మీ కొత్త యూనిఫామ్ తయారీ కాంట్రాక్టుపై రాద్దాంతం..మాకే ఇవ్వాలంటున్నOCF

కాగా… మావోయిస్టుల ఎదురు   కాల్పుల్లో గాయపడిన మధు అనే గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ను   కర్రెగుట్ట అటవీ ప్రాంతం నుంచి  హన్మకొండ తరలించి ….అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు తరలించారు.  జవానును సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చేర్చి   చికిత్స అందిస్తున్నారు.

సికింద్రాబాద్ లోని  యశోదా ఆస్పత్రికి పోలీసు అధికారులు భారీగా చేరుకున్నారు. ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు,
Ig ప్రభాకర్ రావు, ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్‌లు ఆస్పత్రికి వచ్చి  మధు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని దగ్గరుండి  చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు చత్తీస్‌గఢ్‌లోని సుక్మా మార్జుమ్ అటవీ ప్రాంతం  టోంగ్పాల్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ  ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ప్లీనరీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.  ఈ ఎన్ కౌంటర్‌లో సుమారు 6గురు మవోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఎదురు  కాల్పులు ఇంకా  కొనసాగుతున్నట్లు సమాచారం అందింది.