Police Attack Judge In Court : బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై తుపాకి గురిపెట్టి దాడి చేసిన పోలీసులు..!!

న్యాయదేవత కళ్లెదుటే న్యాయమూర్తిపై పోలీసులు తుపాకీ గురిపెట్టారు.దాడికి పాల్పడ్డారు. పెను సంచలనం కలిగించే ఈ ఘటన బీహార్‌ కోర్టులో చోటుచేసుకుంది.

Police Attack Judge In Court : బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై తుపాకి గురిపెట్టి దాడి చేసిన పోలీసులు..!!

2 Policemen Attack Judge In Bihar Court

2 Policemen Attack Judge In Bihar Court : న్యాయదేవత కళ్లెదుటే న్యాయమూర్తిపై పోలీసులు తుపాకీ గురిపెట్టారు.దాడికి పాల్పడ్డారు. అత్యంత సంచలనం కలిగించే ఈ ఘటన బీహార్‌ కోర్టులో చోటుచేసుకుంది. గురువారం (నవంబర్ 18,2021) బీహార్ లోని మధుబని జిల్లాలో ఇద్దరు పోలీసులు కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై దాడికి దిగడం పెను సంచలనంగా మారింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే సాక్షాత్తు న్యాయమూర్తిపై తుపాకీ గురి పెట్టటం దాడి చేయటాన్ని పాట్నా కోర్టు తీవ్రంగా పరగణించింది. ఈ ఘటనపై పాట్నా హైకోర్టు సుమోటోగా తీసుకుని..స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. ఏదైనా దాడి జరిగితే..న్యాయమూర్తిని రక్షించడానికి ప్రయత్నించాల్సిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇద్దరు కలిసి కోర్టులోనే న్యాయవాదులు,కోర్టు ఉద్యోగులపై దాడి చేసి గాయపరిచిన ఘటన న్యాయస్థానానికి..అటు పోలీసు డిపార్ట్ మెంట్ కే కళంకం తెచ్చినట్లైంది.

Read more : Kim Kardashian: అఫ్ఘాన్ మహిళా ప్లేయర్ల కోసం కిమ్ కర్దాశియన్ స్పెషల్ ఫ్లైట్

దాడికి పాల్పడిన పోలీసుల ప్రేమేయం ఉన్న ఓ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో జాన్‌జహాపూర్ కోర్టు హాలులోకి ప్రవేశించిన ఇద్దరు పోలీసులు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అవినాశ్ కుమార్‌పై తుపాకి గురిపెట్టి దాడి చేశారు. ఈ దాడినుంచి న్యాయమూర్తి అవినాశ్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ..ఈ హఠాత్‌ పరిణామంతో వణికిపోయిన న్యాయమూర్తి ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక చాలాసేపు షాక్ నుంచి కోలుకోలేకపోయారు.

పోలీసుల దాడినుంచి న్యాయమూర్తిని రక్షించేందుకు ప్రయత్నించిన లాయర్లు, కోర్టు ఉద్యోగులపై కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోపాల్‌కృష్ణ, ఎస్సై అభిమన్యు కుమార్ దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనను ‘అసాధారణ, షాకింగ్’ ఘటనగా అభివర్ణించిన జస్టిస్ రాజన్ గుప్తా, మోహిత్ కుమార్ షాతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. నవంబర్ 29న సీల్డ్ కవర్‌లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. అంతేకాదు, ఆ రోజున వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది.

Read more : Farm Laws Repeal : కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

ఈ ఘటన న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేస్తుందని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సరైనదని తాము భావిస్తున్నామని, అలాగే, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, బీహార్ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ, మధుబని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తున్నట్టు పేర్కొంది. కాగా..ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారులు కూడా ఏమాత్రం స్పందించకపోవటం గమనించాల్సిన విషయం.

ఈ ఘటనపై ప్రధాన కార్యదర్శి,… డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బీహార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం డిపార్ట్‌మెంట్ స్పందిస్తు..న్యాయవ్యవస్థను ప్రమాదంలోకి నెట్టినట్లుగా అనిపిస్తోంది అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు, ఈ కేసును సాయంత్రం 7 గంటల సమయంలో ప్రత్యేక విచారణకు లిస్ట్ చేశారు.