Drugs : గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

గోవానుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి హైదరాబాద్ చుట్టు పక్కల విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Drugs : గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్

Soft Ware Engineers Drugs

Drugs : గోవానుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి హైదరాబాద్ చుట్టు పక్కల విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 1.35 లక్షల విలువైన  డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పట్టూరు సూర్య సంపత్ (23) రాజమండ్రికి చెందిన తీగల దీపక్ ఫణీంద్ర స్నేహితులు. వీరిద్దరూ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

కొంతకాలంగా వీరిద్దరూ గోవా నుంచి నిషేధిత డ్రగ్స్ హైదరాబాద్ తీసుకువచ్చి నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో  వీరిద్దరూ ఈనెల 28న గోవా వెళ్లి నిషేధిత  డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిగారు. అక్కడి నుంచి లారీ ఎక్కి రాజమండ్రి వెళుతుండగా చౌటుప్పల్ లో పోలీసులు చేస్తున్న సోదాలకు వీరు చిక్కారు. చౌటుప్పల్ పోలీసులు వీరి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ ను, లక్ష రూపాయలు విలువైన మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని సీఐ తెలిపారు.

Also Read : Covid-19 : దేశంలో కొత్తగా 2,338 కోవిడ్ కేసులు