Covid-19 : దేశంలో కొత్తగా 2,338 కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Covid-19 : దేశంలో కొత్తగా 2,338 కోవిడ్ కేసులు

India Covid

Covid-19 :  దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 19 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.  ప్రస్తుతం దేశంలో 17,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,31,58,087 కేసులు నమోదు కాగా వీరిలో 5,24,630 మంది కోవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న కోవిడ్ నుంచి 2,134 మంది కోలుకోగా …. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,15,574కి చేరింది.

భారత్ లో గడిచిన 500 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 193.45,19,805 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. నిన్న 13,33,064 డోసుల టీకాలు వేశారు. దేశంలో ఇప్పటి వరకు 85,04,41,292 మందికి పైగా కరోన నిర్ధారణ పరీక్షలు చేయగా…. గడిచిన 24 గంటల్లో 3,63,883 మందికి పరీక్షలు నిర్వహించారు.  దేశవ్యాప్తంగా 3,378 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.