Sushil Kumar’s Case : రెజ్లర్ సుశీల్ కేసులో కొత్త మలుపు.. హత్యకు కారణం ఆ విదేశీ యువతి?

ఒలింపిక్ మెడలిస్ట్, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్న రెజ్లర్ సాగర్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఓ

Sushil Kumar’s Case : రెజ్లర్ సుశీల్ కేసులో కొత్త మలుపు.. హత్యకు కారణం ఆ విదేశీ యువతి?

Sushil Kumar’s Case

Sushil Kumar’s Case : ఒలింపిక్ మెడలిస్ట్, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్న యువ రెజ్లర్ సాగర్ ధన్ఖర్‌ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఓ విదేశీ మహిళ.. సాగర్ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమైందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన యువతి సాగర్ స్నేహితురాలు. కాగా, పుట్టిన రోజు పార్టీలో సుశీల్ ఫ్రెండ్ అజయ్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. దీంతో గొడవ స్టార్ట్ అయ్యిందని, సాగర్ హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

యువ రెజ్లర్‌ సాగర్‌ హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతని కస్టడీని జూన్‌ 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. రెజ్లర్‌ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్‌ సహా మొత్తం పది మందిని ఇప్పటివరకు అరెస్ట్‌ చేశారు.

ఈ హత్య కేసులో అరెస్టుకు ముందు సుశీల్ కుమార్ మూడు వారాల పాటు పరారీలో ఉన్నాడు. ఇతని సహచరుడైన అజయ్ కుమార్ ని పోలీసులు మొదట అరెస్టు చేశారు.

15 రోజులు తీవ్రంగా గాలించిన ఢిల్లీ పోలీసులు.. లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష నగదు రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. అతడి కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పంజాబ్‌లో చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళుతుండగా ఓ టోల్ గేట్ వద్ద సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పంజాబ్‌లోని సుశీల్ స్నేహితుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని గాలింపు చేపట్టడంతో చివరకు పట్టుబడ్డాడు. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖర్ హత్య కేసులో సుశీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ధన్ఖర్‌పై దాడి చేసి అతడి మృతికి కారకుడయ్యాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ మృతి చెందినప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలోనే ఉన్నాడు.

మే మొదటి వారంలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖర్ చనిపోయాడు. సాగర్ పై దాడి చేసిన వారిలో సుశీల్ కుమార్ కూడా ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుశీల్ కుమార్ మే 18న ఢిల్లీ రోహిణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. న్యాయస్థానం తిరస్కరించింది. మే 4 నుంచి సుశీల్ పరారీలోనే ఉన్నాడు. ఆ తర్వాత రెండు వారాలకు చిక్కాడు.