పీహెచ్‌డీ స్టూడెంట్‌ని రెండో పెళ్లి చేసుకోవాలని డ్రామా చేసిన నిరుద్యోగి

పీహెచ్‌డీ స్టూడెంట్‌ని రెండో పెళ్లి చేసుకోవాలని డ్రామా చేసిన నిరుద్యోగి

ఢిల్లీకి చెందిన యువతి తాను డీఆర్డీఓ అని చెప్పి పెళ్లికి చేసుకున్న వ్యక్తి చేతిలో మోసపోయానంటూ పోలీస్ కంప్టైంట్ చేసింది. పరిశోధనలో ఆ యువకుడు నిరుద్యోగి మాత్రమే కాక, అప్పటికే పెళ్లి అయినవాడు. అయితే తనకు తానుగా డూప్లికేట్ ప్రూఫ్‌లతో ఓ డీఆర్డీఓ సైంటిస్ట్‌లా కలరింగ్ ఇచ్చాడు. 

అతని ఉద్యోగం, వివాహమైన విషయం రెండింటినీ తనముందు దాచాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫోర్జింగ్ చేసిన ఐడీ కార్డులు ఆధారాలుగా చూపించి వారిద్ధరి మధ్య సంబంధాన్ని ఫేక్ అని నిరూపించే ప్రయత్నం చేసింది. 

జితేందర్ సింగ్ అనే వ్యక్తి తాను డీఆర్డీఓ సైంటిస్ట్ అని చెప్పి యువతిని పరిచయం చేసుకున్నాడు. పరిచయాన్ని చక్కగా వాడుకుని పెళ్లి చేసేసుకున్నాడు. అలా వివాహం జరిగిన కొన్నాళ్లకు ఆ వ్యక్తి నిరుద్యోగి అని మహిళకు తెలిసిపోయింది. పెళ్లి కోసం ఈ డ్రామా ఆడాడని నిర్దారించుకుంది. 

‘బాధిత మహిళ ద్వారకా ఉత్తర పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 419, సెక్షన్ 420, సెక్షన్ 494ల కింద కేసు నమోదు అయింది’ అని ద్వారకా డీసీపీ యాంటో ఆల్ఫోన్స్ తెలిపారు. కేసు విచారణ చేపట్టామని, పరిశోధనలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.