Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు.. జమ్మూ కశ్మీర్లో ప్రమాదం
దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.

kiren rejiju's car met with accident
Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును శనివారం రాంబన్ జిల్లాలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆయనే కాకుండా కారులో ఉన్నవారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Today while going from Jammu to Srinagar by road, Union Minister for Law and Justice Kiran Rijiju’s car met with a minor accident. No one was injured in the accident. Kiren Rijiju was driven safely to his destination: Ramban Police pic.twitter.com/6bQcE1X5N7
— ANI (@ANI) April 8, 2023
దీనికి ముందు కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు ఉద్దాంపూర్ వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.
Going from Jammu to Udhampur in Jammu & Kashmir to attend Legal Services Camp. Many beneficiaries of the Central Govt Schemes are attending the function along with Judges and NALSA team. Now, one can enjoy the beautiful road throughout the journey. pic.twitter.com/5yg43aJX1C
— Kiren Rijiju (@KirenRijiju) April 8, 2023