Groom Kidnapped : కొద్దిసేపట్లో పెళ్లి …..వరుడి కిడ్నాప్

మరి కొద్ది సేపట్లో జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలని ముగ్గురు యువకులు వరుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Groom Kidnapped : కొద్దిసేపట్లో పెళ్లి …..వరుడి కిడ్నాప్

Groom Kidnapped

Groom Kidnapped : మరి కొద్ది సేపట్లో జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలని ముగ్గురు యువకులు వరుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫుతేపూర్ జిల్లాలోని షాపూర్ కు  చెందిన  పెళ్లి కొడుకు జుగల్ కుష్వాహ్‌కు సమీప గ్రామంలోని బాలికతో మే 29న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లికోసం మగపెళ్లివారు కళ్యాణ మండపానికి వచ్చి ఉన్నారు.

మరికొద్దిసేపట్లో  పెళ్లి జరగాల్సి ఉండగా…బైక్ లపై వచ్చిన ముగ్గురు దుండగులు పెళ్లికొడుకును కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. సమీపంలోని పండ్ల తోటల్లోకి  తీసుకు వెళ్లి అతడ్ని పెళ్లి విరమించుకోవాలని బెదిరించారు. మీ అమ్మాయిని చేసుకోవటం ఇష్టంలేదని చెప్పి పెళ్లి రద్దు చేసుకోవాలని.. మా మాట కాదని  నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి మండపం వద్దేకాల్చి పారేస్తామని హెచ్చరించారు.

అనంతరం సమీపంలోని నిర్జన ప్రదేశంలో వరుడ్ని వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు తన తండ్రికి ఫోన్ ద్వారా ఈ సమాచారం చేరవేశాడు. పెళ్లి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లి కోసం బందో బస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.