Wife Killed Husband : మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను హత్య చేసిన భార్య
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన భార్య అలివేలు భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Wife Killed Husband
Wife Killed Husband : జోగుళాంబ గద్వాల జిల్లాలో వేధింపులకు గురి చేస్తున్న భర్తను భార్య హత్య చేశారు. ఇటిక్యాల మండలంలో మద్యానికి బానిసై నిత్యం వేధిస్తోన్న భర్తను భార్య హత్య చేశారు. అలంపూర్ సీఐ సూర్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెర్లపల్లికి చెందిన అలివేలు, జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మొగలిరావుల చెరువుకు చెందిన మంద దేవరాజ్ తో 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవరాజ్ మద్యానికి బానిస కావడంతో వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరు తరచూ గొడవలు పడేవారు. మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన భార్య అలివేలు భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
Extramarital Affair : ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య
ఈ క్రమంలో మద్యం తాగి సేవించి నిద్రపోతున్న భర్తను ఆదివారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గద్వాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.