Uttar Pradesh : మహిళా జడ్జిని వేధించిన లాయర్-కేసు నమోదు

సివిల్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న ఒక మహిళను అదే  కోర్టులో పని చేసే ఒక న్యాయవాది వేధింపులకు గురిచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

Uttar Pradesh : మహిళా జడ్జిని వేధించిన లాయర్-కేసు నమోదు

Uttar pradesh Judge

Uttar Pradesh :  మహిళలు   ఏ రంగంలో   ఎంత ప్రగతి సాధించినా  వారిపై   వేధింపులు ఆగటం లేదు.  సివిల్ కోర్టులో జడ్జిగా పని చేస్తున్న ఒక మహిళను అదే  కోర్టులో పని చేసే ఒక న్యాయవాది వేధింపులకు గురిచేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్  కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా న్యాయమూర్తి ఒంటరిగా  జీవిస్తోంది.  న్యాయవాదిగా పని చేసే మహ్మద్ హరూన్ అనే వ్యక్తి  ఆమెను  గత కొంత కాలంగా  వేధిస్తున్నాడు.  సాయంత్రం   పూట వాకింగ్   చేస్తున్నప్పుడు ఆమె   వెంటపడి వెళ్లే వాడు.   ఆమె వేసుకున్న రంగుల దుస్తులు, బూట్లు వేసుకునే వాడు.

ఆమె సెల్ ఫోన్ కు మెసేజ్‌లు   కూడా పంపేవాడు. అంతే కాక ఆమె ఆఫీసులో పని చేసుకుంటున్నప్పుడు   గోడలోని   కన్నం  నుంచి ఆమె ఆఫీసులోకి పదే పదే తొంగి చూసేవాడు. ఇవన్నీ గమనించిన ఆ మహిళా    న్యాయమూర్తి   పలుమార్లు హెచ్చరించినప్పచటికీ    లెక్క చేయకుండా వీటిని కొనసాగించసాగాడు.

దీంతో   విసిగిపోయిన మహిళా జడ్జి స్ధానిక పోలీసులకు న్యాయవాది హరూన్ పై   ఫిర్యాదు చేసింది. అతడు పంపిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ లు అందచేసింది. దీంతో పోలీసులు న్యాయవాదిపై  ఐపీసీ సెక్షన్ 354  డీ, సీ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్పీ అనూప్ కుమార్ తెలిపారు.

Also Read : Uttar Pradesh : స్నేహితురాలితో తిరుగుతున్న బీజేపీ నేతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య-దేహశుధ్ధి చేసిన బంధువులు