Kv Admission : కేంద్రీయ విద్యాలయలో ప్రవేశానికి కొనసాగుతున్న ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి స్కాన్ చేసిన ఫోటో, పిల్లల బర్త్ సర్టిఫికెట్, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, ఎస్,సి,ఎస్.టి,కి సంబంధించిన వారైతే సంబంధిత సర్టిఫికెట్, దివ్యాంగుల కేటగిరి చెందిన వారైతే పిడబ్ల్యూడీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Kv Admission : కేంద్రీయ విద్యాలయలో ప్రవేశానికి కొనసాగుతున్న ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్

Kv Admission

Kv Admission : 2022 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హత ఉన్న పిల్లలు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1వ తరగతిలో అడ్మిషన్ కోరుకునే వారికి మార్చి 31 నాటికి 6సంవత్సరాలు కలిగి ఉండాలి. ఏప్రియల్ 1న పుట్టిన వారు కూడా అర్హులే. అయితే నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కనీస వయస్సు 6ఏళ్లకు, గరిష్ట వయస్సు 8ఏళ్లకు పెంచారు. ఫిబ్రవరి 28,2022 నుండి అడ్మిషన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్స్ కు మార్చి 21 చివరి తేదిగా నిర్ణయించారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి స్కాన్ చేసిన ఫోటో, పిల్లల బర్త్ సర్టిఫికెట్, ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, ఎస్,సి,ఎస్.టి,కి సంబంధించిన వారైతే సంబంధిత సర్టిఫికెట్, దివ్యాంగుల కేటగిరి చెందిన వారైతే పిడబ్ల్యూడీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల తల్లిదండ్రులు, రిజిస్ట్రేషన్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.inలో సంప్రదించాలి. ఎంపికైన విద్యార్ధుల జాబితాలను మూడు విడతలుగా ప్రకటిస్తారు. మార్చి 25న తొలిజాబితా, ఏప్రిల్ 1న రెండవ జాబితా, ఏప్రిల్ 8న మూడో జాబితా ప్రచురిస్తారు.