CBSE ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 10:04 AM IST
CBSE ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గ్రూప్ A, గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మెుత్తం 357 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు నవంబర్ 15,2019 న ప్రారంభమైంది. తాజాగా CBSE దరఖాస్తు గడువు పెంచింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.  

విభాగాల వారీగా ఖాళీలు :

గ్రూప్ A పోస్టులు :
అసిస్టెంట్ సెక్రటరీ – 14
అసిస్టెంట్ సెక్రటరీ(IT) – 07
అనలిస్ట్(IT) -14

గ్రూప్ C పోస్టులు :
జూనియర్ అసిస్టెంట్ – 204
సీనియర్ అసిస్టెంట్ – 60
స్టెనోగ్రాఫర్ – 25
జూనియర్ అకౌంటెంట్ – 19
అకౌంటెంట్ – 06
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ – 08

విద్యార్హత: 
అభ్యర్ధులు ఇంటర్, డిగ్రీ, PG, B.E, B-Techతో పాటుగా షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. 

వయసు:
అభ్యర్ధులు 27 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 

ఎంపికా విధానం: 
అభ్యర్ధులను కంప్యూటర్ బేస్ టెస్ట్, టైపింగ్ టెస్ట్  ద్వారా ఎంపిక చేస్తుంది.

దరఖాస్తు ఫీజు :
గ్రూప్ A అభ్యర్ధులు రూ.1500 చెల్లించాలి. గ్రూప్ C అభ్యర్ధులు రూ.800 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, ఎక్స్ – సర్వీసెస్ మెన్, మహిళా అభ్యర్ధులకు  మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 15,2019
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 23,2019