ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 07:21 AM IST
ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాల వారీగా భర్తీ చేయనుంది. మెుత్తం 1493 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విభాగాల వారీగా ఖాళీలు : 
ఎగ్జిక్యూటివ్ (సెక్షన్ A రెగ్యులర్) – 60
నాన్ ఎగ్జిక్యూటివ్ (సెక్షన్ B రెగ్యులర్) – 929
ఎగ్జిక్యూటివ్ (సెక్షన్ C కాంట్రాక్ట్) – 106
నాన్ ఎగ్జిక్యూటివ్ (సెక్షన్ D కాంట్రాక్ట్) – 398 

విద్యార్హత :
అభ్యర్థులు సంబంధిత విభాగంలో BE, B-TECH, ఫైనాస్ విభాగంలో CA, ICWA, LAW విభాగంలో LLB, ఇంజనీరింగ్ డిప్లమా, డిగ్రీ, ఐటీఐ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :
అభ్యర్ధులు 18  నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం : 
అభ్యర్థులను రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :
జనరల్, EWS,ఓబిసీ అభ్యర్ధులకు రూ.500 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు మాత్రం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ముఖ్య తేదిలు : 
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 14, 2019.
దరఖాస్తు చివరితేది : జనవరి 13, 2020.