IIT JEE : అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

IIT JEE : అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ వాయిదా

Iit Jee

IIT JEE Advanced : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. పరీక్ష రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు చాలా మంది విద్యార్థులు ఎదురు చూశారు. కానీ జేఈఈ మెయిన్ ర్యాంకులను వెల్లడించడంలో ఆలస్యం అవుతోంది. దీంతో…రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read More : JEE: జేఈఈ 4వ సెషన్ పరీక్షలు

పరీక్షను నిర్వహిస్తున్న ఐఐటీ ఖరగ్ పూర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూల్ లో మార్పులు చేసింది. సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మెయిన్ క్వాలిఫై అయిన.. 2.5 లక్షల మంది మాత్రమే అడ్వన్స్ డ్ పరీక్ష రాయడానికి వీలుంది. దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన..ఐఐటీల్లో ప్రవేశాల కోసం..జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే.

Read More : నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ, కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్

ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించవచ్చని, పరీక్ష మాత్రం అక్టోబర్ 03వ తేదీన యదాతథంగా జరుగనుంది. జేఈఈ మెయిన్ ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.