Ssc Jobs : 3261 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

అయా పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అపై ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు అయా పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల

Ssc Jobs : 3261 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

Ssc Jobs

Ssc Jobs : కేంద్ర ప్రభుత్వ నియామక సంస్ధ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే గరల్స్ కేడెట్ ఇన్ స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబోరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్ టైల్ డిజైనర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం 3261 పోస్టులను భర్తీ చేయనుంది.

అయా పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అపై ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు అయా పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష , స్కిల్ టెస్ట్ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. పరీక్ష విధానం మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఇక పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో హైద్రాబాద్, విజయవాడ, కడప, విశాఖ పట్నంలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 100 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ధరఖాస్తులకు చివరి తేది అక్టోబరు 25, ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించటానికి అక్టోబరు 28వరకు అవకాశం కల్పించారు, కంప్యూటర్ బేస్డ్ పరీక్షను 2022 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://ssc.nic.in/సంప్రదించాలి.