MSME Recruitment : మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీ సెంటర్ లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

MSME Recruitment : మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీ సెంటర్ లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

Recruitment of contract jobs in Micro, Small and Medium Enterprises Technology Centre

MSME Recruitment : భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్‌ రాష్ట్రంలోని భీవాడిలోనున్న మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీ సెంటర్ లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 సీనియర్ ఇంజినీర్, ఇంజినీర్ (ట్రైనింగ్), స్టోర్ ఆఫీసర్, సీనియర్ టెక్నీషియన్ (ప్రొడక్షన్), సీనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ (ఈఎల్‌ఈ, మెకానికల్‌) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఈ, బీటెక్‌, కామర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DY. జనరల్ మేనేజర్, ప్లాట్ నెం SP3, 871(A), 872, RIICO ఇండస్ట్రియల్ ఎస్టేట్ పత్రేడి, పోస్ట్ ఆఫీస్-తపుకడ, భివాడి 301019 (రాజస్థాన్). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://msme.gov.in/ పరిశీలించగలరు.