Job Vacancies : ఎయిమ్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ,ఎండీ,ఎమ్‌ఎస్,ఎమ్‌డీఎస్,డీఎమ్‌,ఎమ్‌సీహెచ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

Job Vacancies : ఎయిమ్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Job Vacancies : కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 82 టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీలకు సంబంధించి 18 ప్రొఫెసర్ పోస్టులు, 13 అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 16 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. అనెస్థీషియా, అనాటమీ, బయోకెమిస్త్రీ, డెన్‌టిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిట్‌ అడ్మినిస్ట్రేషన్‌, మైక్రోబయాలజీ, నూక్లియర్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ,ఎండీ,ఎమ్‌ఎస్,ఎమ్‌డీఎస్,డీఎమ్‌,ఎమ్‌సీహెచ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.1,23,000ల నుంచి రూ.2,20,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తును పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిక్రూట్‌మెంట్ సెల్, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), ఎయిమ్స్, రాజ్‌కోట్ టెంపరరీ క్యాంపస్, పీడీయు మెడికల్ కాలేజ్ & సివిల్ హాస్పిటల్, రాజ్‌కోట్ 360001. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://aiimsrajkot.edu.in/పరిశీలించగలరు.