Police Job Cutoff Marks : పోలీస్‌ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. కటాఫ్‌ మార్కులు తగ్గింపు

పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పోలీసు ఉద్యోగార్థుల కటాఫ్‌ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్‌ నియామక మండలి కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Police Job Cutoff Marks : పోలీస్‌ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. కటాఫ్‌ మార్కులు తగ్గింపు

POLICE

Police Job Cutoff Marks : పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పోలీసు ఉద్యోగార్థుల కటాఫ్‌ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్‌ నియామక మండలి కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓసీ అభ్యర్థులకు 30శాతం, బీసీ అభ్యర్థులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 20శాతం మార్కులను కేటాయిస్తున్నట్టు అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసు ద్వారా వెల్లడించింది.

దీనిప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. శారీరధారుడ్య పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు 30 శాతంగా, బీసీలకు 35 శాతంగా, ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ, ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులను అర్హతగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. దీని ప్రకారం ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో ప్రభుత్వం స్పందించి జీవోను సవరించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.