Tripura Polls: త్రిపుర బరిలో 41 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 15.58 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 13.90 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక క్రమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంది. ఆ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏడుగురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

Tripura Polls: త్రిపుర బరిలో 41 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

Criminal cases against 41 candidates in Tripura assembly polls

Tripura Polls: ఈ నెల 16న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఇప్పటికి దాదాపు పూర్తైనట్టే. 60 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 259 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. అయితే తాజాగా అసోషియేషన్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులు ఉన్నారు. అంతే కాకుండా 41 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కోటీశ్వరుల్లో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన వారే 17 మంది ఉన్నారు. ఆ తర్వాత టిప్రామోతా పార్టీకి చెందిన తొమ్మిది మంది సీపీఎంకి చెందిన ఏడుగురు అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు.

Fire Accident : హైదరాబాద్‌లో మళ్లీ మంటల కలకలం.. సికింద్రాబాద్ రైల్ నిలయం దగ్గర అగ్నిప్రమాదం

త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 15.58 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 13.90 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక క్రమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంది. ఆ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏడుగురు అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

India vs Australia Test: అసలైన సమరం షురూ..! నేటి నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ .. లైవ్ అప్‌డేట్