Karnataka Polls: 15 సార్లు ఎన్నికలు, 3 సార్లే పూర్తి స్థాయి ప్రభుత్వాలు.. కర్ణాటకలో ఈసారైనా 5ఏళ్ల ప్రభుత్వం వచ్చేనా?

చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.

Karnataka Polls: 15 సార్లు ఎన్నికలు, 3 సార్లే పూర్తి స్థాయి ప్రభుత్వాలు.. కర్ణాటకలో ఈసారైనా 5ఏళ్ల ప్రభుత్వం వచ్చేనా?

Karnataka Polls: కర్ణాటకలో చాలావరకు అర్థాయుష్షు ప్రభుత్వాలే ఉంటాయి. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడం. రెండవది.. పార్టీ హైకమాండ్ తరుచూ ముఖ్యమంత్రులను మారుస్తుండడంట. ఇప్పటి వరకు కర్ణాటకలో 15 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. కేవలం మూడుసార్లు మాత్రమే పూర్తి స్థాయి ప్రభుత్వాలు కొనసాగాయి. మిగతా కాలమంతా ముఖ్యమంత్రులు మారడం, అప్పుడప్పుడు రాష్ట్రపతి పాలన కొనసాగింది.

Delhi Government : ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు : సీఎం కేజ్రీవాల్

చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి. అనంతరం 18 ప్రభుత్వాలు అర్థాయుష్సుతోనే ముగిశాయి. ఇందులో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో 2018లో ఒకసారి 6 రోజుల ప్రభుత్వం, 2007లో ఒకసారి 7 రోజుల ప్రభుత్వం అతి తక్కువ కాలం ప్రభుత్వాలుగా నిలిచాయి.

Karnataka Polls: బీజేపీలో వ్యతిరేకత, సిద్ధరామయ్య పాపులారిటీ.. ఎగ్జిట్ పోల్స్‭లో వెల్లడైంది ఇదేనట

ఐదుసార్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఇక 15వ అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వాలు మారాయి. ఇందులో యడియూరప్ప నేతృత్వంలో రెండు ప్రభుత్వాలు కాగా, ఒకటి కుమారస్వామి ప్రభుత్వం, మరొకటి బసవరాజు బొమ్మై ప్రభుత్వం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చాలాసార్లు హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావడం కూడా పూర్తి స్థాయి ప్రభుత్వాలు ఏర్పడకపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది. అయితే ఈసారి కూడా అలాంటి సూచనలే కనిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ దాటుతుందని చాలా సర్వేలు వెల్లడించాయి.

Maharashtra Politics: సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడను.. మహారాష్ట్ర సీఎం ఏక్‭నాథ్ షిండే

కాంగ్రెస్ లేదంటే బీజేపీ.. ఏదో ఒక పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే ఐదేళ్ల ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ ఈ రెండు పార్టీల అధిష్టానం నిర్ణయంపై కూడా ఐదేళ్ల ప్రభుత్వాలు ఉంటాయా అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం మూడేళ్లలో రెండుసార్లు ప్రభుత్వాల్ని మార్చింది. అంతకు ముందు కాంగ్రెస్ ఇలా అనేకసార్లు చేసింది. ఈ రెండు పార్టీలే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా ఉండడంతో పూర్తి స్థాయి ప్రభుత్వంపై అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.