Maharashtra Politics: సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడను.. మహారాష్ట్ర సీఎం ఏక్‭నాథ్ షిండే

అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్‌నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనానికి నాటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేసును బదిలీ చేసింది

Maharashtra Politics: సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడను.. మహారాష్ట్ర సీఎం ఏక్‭నాథ్ షిండే

Maharashtra Politics: ఏక్ నాథ్ షిండే చీఫ్ విఫ్ నియామకం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. అంతే కాకుండా పార్టీలో విభేదాలను పార్టీలోనే పరిష్కరించుకోవాలి తప్ప గవర్నర్ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యపై తానేమీ మాట్లాడనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే అన్నారు. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ఆయన ముంబైలో విలేకర్లతో మాట్లాడారు.

Terrorists Links In Hyderabad : హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం .. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్‌గా కుట్రలు

‘‘మహారాష్ట్ర మాజీ గవర్నర్ మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నేనేమీ మాట్లాడను. కానీ ఆయన చట్ట ప్రకారమే పని చేశారని మాత్రం నేను చెప్తాను. బలపరీక్ష జరిగింది. అందులో మహావికాస్ అగాఢీ ప్రభుత్వం తన బలాన్ని చూపెట్టుకోలేకపోయిందన్ని నిజం కాదా?’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఆయన (ఉద్ధవ్ థాకరే) సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కంటే ఎక్కువనా? మా విప్ సహా ఇతర ఆఫీస్ బేరర్‌లను నియమించకుండా అడ్డుకుంటున్నారు’’ అని షిండే అన్నారు.

Delhi Government : ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు : సీఎం కేజ్రీవాల్

అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్‌నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనానికి నాటి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేసును బదిలీ చేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపర్చిన అనర్హత అంశాలతో పాటు ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 సహా అనేక రాజ్యాంగపరమైన అంశాలపై సుదీర్ఘ వాదనలు జరిగాయి.

Karnataka Polls: బీజేపీలో వ్యతిరేకత, సిద్ధరామయ్య పాపులారిటీ.. ఎగ్జిట్ పోల్స్‭లో వెల్లడేంది ఇదేనట

స్పీకర్‌ను తొలగించాలంటూ ఒక పిటిషన్ పెండింగులో ఉండగా, ఆ స్పీకర్ అనర్హత అంశాలపై నిర్ణయం తీసుకోవడం కుదరదని షిండే వర్గం వాదించింది. కాగా, దీనిపై నేడు విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమకోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పై తీర్పును వెలువరించింది.