KCR: అక్కర్లేని ఉప ఎన్నిక ఇది, అయినా ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. మునుగోడు సభలో కేసీఆర్

కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన రాజకీయంగా కేసీఆర్ అభివర్ణించారు. ఆత్మగౌరవం ఉన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి ఇష్టపడలేదని, అలాంటి రాజకీయ నేతలు రాష్ట్రానికి దేశానికి కావాలని కేసీఆర్ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేల్ని సభా వేదికపైకి పిలిచి అభినందించారు.

KCR: అక్కర్లేని ఉప ఎన్నిక ఇది, అయినా ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. మునుగోడు సభలో కేసీఆర్

kcr speech at munugode public meeting

KCR: మునుగోడు ఉప ఎన్నిక అక్కర్లేని ఎన్నికని, అయితే ఈ ఎన్నికపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొందరి స్వార్థ రాజకీయాల కోసం, వ్యక్తిగత లబ్ది కోసం ఉప ఎన్నిక ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలో విపక్షాలు అనేక సవాళ్లు చేస్తున్నారని, అనేక ఫీట్లు వేస్తున్నారని.. అయితే వారి సర్కస్ ఫీట్లు చెల్లవని కేసీఆర్ అన్నారు.

ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన రాజకీయంగా కేసీఆర్ అభివర్ణించారు. ఆత్మగౌరవం ఉన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి ఇష్టపడలేదని, అలాంటి రాజకీయ నేతలు రాష్ట్రానికి దేశానికి కావాలని కేసీఆర్ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేల్ని సభా వేదికపైకి పిలిచి అభినందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేల్ని కొని తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని, అయితే బీజేపీ వేసే ఇలాంటి ఫీట్లు తెలంగాణలో చెల్లవని కేసీఆర్ అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పోరాటం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ జీఎస్టీ పేరుతో పన్నుల మీద పన్నులు వేసి ప్రజలపై ఎనలేని భారం మోపుతోందని ఆయన విమర్శించారు. దేశంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఇప్పటికీ కోతలు తప్పడం లేదని, అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని వర్గాల వారికి 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉందని కేసీఆర్ అన్నారు. కరెంట్ సహా దేశంలోని వనరులు, సంపద అంతా కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆయన మాట్లాడుతూ ‘‘60 ఏళ్ల కింద జరిగిన చిన్న పొరపాటు కారణంగా 58 ఏళ్ల పోరాటం చేశాం. ఎన్నో ప్రాణాలు పోయాయి, నేను సైతం చావు నోట్లోకి వెళ్లి వచ్చాను. అందుకే మళ్లీ మళ్లీ తప్పు జరగొద్దని నేను అనుకుంటాను. ఎవరికైనా తాము ఎవరి కోసం పోరాటం చేస్తున్నామో వారి నుంచి మద్దతు కావాలి. అలాగే నేను తెలంగాణ ప్రజల తరపున అంతిమ శ్వాస వరకు పోరాడతాను. నాకు మీ నుంచి మద్దతు రాకపోతే నా పోరాటానికి అర్థం ఉండదు’’ అని అన్నారు.

Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్