ఒకవైపు కరోనా భయం.. ఇటు లాక్‌డౌన్.. మానసిక ఆందోళనల మధ్య నలిగిపోతున్నారు!

ఒకవైపు కరోనా భయం.. ఇటు లాక్‌డౌన్.. మానసిక ఆందోళనల మధ్య నలిగిపోతున్నారు!

కరోనా వైరస్ మహమ్మారి ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉండాలి. దీని కారణంగా ఒక వ్యక్తి జీవితంలో రోజువారీ కార్యక లాపాలన్నింటిని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే చాలామంది వైరస్ బాధితులు ఐసోలేషన్ పిరియడ్‌లో మానసిక ఆందోళనకు గురిఅవుతుంటారు. కొవిడ్-19 పేషెంట్ లేదా స్వీయ నిర్బందంలోని వ్యక్తులపై వ్యాధికి సంబంధించి అనుమానాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుంటాయి.

45 శాతం మందిలో మానసిక ఒత్తిడి :
ఇందులో ఎక్కువ ఫోన్ కాల్స్ ఎక్కడ తమకు వైరస్ సోకిందోననే ఆందోళన, భయమే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికారణంగా వారు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదా నివసించే ప్రాంతం విడిచి పోవడం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెంగళూరులోని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) ఆఫ్ ది డైరెక్టర్, డాక్టర్ బిఎన్ గంగాధర్ చెప్పారు. అమెరికాలో Kaiser Family Foundation నిర్వహించిన ఓ పోల్ సర్వేలో 45 శాతం మంది అమెరికన్లలో చాలామంది తమ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు.

అతడి పేరు (మోహన్) అతడిది నిరుపేద కుటుంబం.. కరోనా వైరస్ సోకింది.. ఇతడిపై కుటుంబం ఆధారపడింది. ఉద్యోగమే జీవనాధారం.. వైరస్ సోకడంతో ఐసోలేషన్ వార్డులో ఉండాల్సి వచ్చింది. అతడితో పాటు ఉన్న ఇంట్లోని వారందరికి కూడా వైరస్ సోకింది. నెలజీతంపై ఆధారపడిన ఇతగాడికి వైరస్ సోకడంతో అన్నింటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫలితంగా ఉద్యోగానికి వెళ్లేలేని పరిస్థితి.. ఇంతకీ అతడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు. ఉపాధితో పాటు కరోనా వ్యాధికి గురికావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. కరోనా కారణంగా అతడి కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఇలాంటి పరిస్థితులను ఎవరో ఒకరూ ఎదుర్కొంటునే ఉంటున్నారు.

మానసిక ఆందోళన :
మరో వ్యక్తిలో (థామస్) అనే వ్యక్తిలో కరోనా సోకింది అనే అనుమానం ఉంది. ఇతడిది యుక్త వయస్సే. కరోనా వైరస్ వ్యాప్తిపై వచ్చే అనేక విషయాలను చూస్తున్నాడు.. రోజూ వింటున్నాడు. అదే అతడిలో భయాన్ని, ఆందోళన కలిగించింది. క్రమంగా మానసిక సమస్యగా మారింది. అందరూ తనను దూరం పెడుతున్నారని, ఎవరిని కలిసే అవకాశం లేదని, కరోనా సోకినట్టు తెలిస్తే ఎక్కడ తనను వెలి వేస్తారోననే భయమే అతడిలో ఎక్కువగా ఉంది. తన వల్ల మరొకరికి వైరస్ సోకితే తనను నిందిస్తారేమనని ఆందోళన ఎక్కువగా కనిపించేది.. నిద్రలేమితో అనారోగ్యానికి గురయ్యాడు. అదే దిగులుతో ఆత్మహత్యాయత్నం చేశాడు.

బాధితుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ : 
ఇటీవలే కరోనా సోకినట్టు అనుమానంతో ఓ వ్యక్తిని ఐసోలేట్ వార్డుకు తరలించగా అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి కారణం అతడి మానసిక ఒత్తిడే అని వైద్యనిపుణులు తేల్చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సామాజిక దూరాన్ని భౌతిక దూరంగా వర్ణించింది. మీ సోషల్ నెట్ వర్క్ అకౌంట్లలో నిర్వహించాలని, అందులో  ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలని సూచిస్తోంది. అది టెలిఫోన్, ఈ-మెయిల్, సోషల్ మీడియా లేదా వీడియో కాన్ఫరెన్స్ వంటి ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు.

అంతేకాదు.. కరోనా కేసులు, మరణాలకు సంబంధించి వార్తలను చూసి కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ప్రారంభించింది. మానసిక-సోషల్ సమస్యలు ఎదుర్కొనేవారి కోసమే ఈ హెల్ఫ్ లైన్ తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 600 కాల్స్ వరకు వస్తున్నాయి.

కరోనాపై అందరికంటే ముందుండి పోరాడుతున్న వైద్యాధికారులంతా సైనికుల్లా వ్యాధిపై యుద్ధం చేస్తుంటారు. అది వారి వృత్తిపట్ల అంకితభావాన్ని సూచిస్తుంది. కొందరు నివాస కాలనీలు వైద్యులు, పారామెడిక్స్ ను తిరస్కరిస్తున్న పరిస్థితి నెలకొంది. United Nations Inter-Agency Standing Committee చెప్పిన ప్రకారం.. ఆరోగ్య
సంరక్షణ కార్మికులు కూడా తమకు ఇష్టమైన వారికి ఎక్కడ వైరస్ సోకుతుందనే భయమే ఎక్కువగా ఉంటుంది.

వీరంతా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)తో బాధపడుతుంటారని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారిపై మహమ్మారి, లాక్ డౌన్ సంఖ్య ఊహించటం కష్టం కాదని చెప్పారు. కేరళ, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల మత్తుపదార్థాలను బానిసలకు అందజేయడం హాస్యాస్పదంగా అనిపించవచ్చు.