కాలుష్యంలో తిరిగే వాళ్లకు ఈ డ్రింక్స్ మంచివి

కాలుష్యంలో తిరిగే వాళ్లకు ఈ డ్రింక్స్ మంచివి

సంవత్సరానికోసారి గాలిలో కాలుష్య స్థాయి పెరుగుతూనే ఉంది. ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రజలు మామూలుగా తిరగడం కష్టంగా మారింది. కనీస భద్రతగా మాస్క్ లు ధరించి బయటికొస్తున్నారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలే కాకుండా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. 

వీటి వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ, చర్మ సంబంధిత సమస్యలతో పాటు మొదలైనవి సంక్రమిస్తాయి. మరి ఇటువంటి వాటి నుంచి సేఫ్ గా ఉండాలంటే అంత కష్టమైన విషయమేమీ కాదు. డైట్ లో కొద్దిపాటి మార్పులు తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. ప్లూయిడ్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచి అంతర్గతంగా ఉన్న బ్యాక్టీరియాపై పోరాడుతుంది.

మంచి నీరు
ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రేషన్ తో ఉండడం తప్పనిసిరి. ఎందుకంటే జబ్బులపైనా క్రిములపైనా సరిగ్గా పనిచేసేది అవే. ఇటువంటి పొల్యూషన్‌ ప్రాంతాల్లో డైట్‌లో ఉండాల్సిన నాలుగు ద్రావణాల గురించి తెలుసుకుందాం. తగినంత నీరు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వు, ఆయిల్ లపై గాలిలో ఉండే కాలుష్యం కారణంగా ఆహారం కలుషితమవుతుంది.

గ్రీన్ టీ
వీటి నుంచి బయటపడటానికి కొద్ది నిమిషాల వ్యవధితో నీరు తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, గొంతులో దురద లాంటి లక్షణాల నుంచి బయటపడటానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. 

టమాటా సూప్
టమాటాలలో ఉండే విటమిన్ సి మనలో ఉండే నిరోధక శక్తిని వేగవంతం చేస్తుంది. ఇందులో ఫైబర్ తో పాటు నీటి స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. కొందరు డిన్నర్ కు బదులు టమాటా సూప్ తీసుకుని పడుకుండిపోతారు. దీనిని జూస్ లా తీసుకున్నా.. సూప్ లా తీసుకున్నా మంచితే. అందులో కొంచెం మిరియాల పొడి కలుపుకుంటే ఇంకా మంచిది.

ఆరెంజ్ జ్యూస్
సైట్రస్ పండ్లు తీసుకుంటే జబ్బు నుంచి త్వరగా బయటపడతారని చెప్తూనే ఉంటారు. అలా కాకుండా ఏ జబ్బూ రాక ముందు తీసుకుంటే వాటి దరిదాపులకు కూడా పోవాల్సిన అవసరం ఉండదు. వీటిలోనూ విటమిన్ సి నిల్వలు నిరోధక శక్తిని వేగవంతం చేస్తాయి.