Gastric Problem : తరచుగా గ్యాస్ సమస్య బాధిస్తుందా ?… ఈ పరీక్షలు చేయించుకోండి

జీర్ణవ్యవస్థ పై భాగాన్ని పరీక్ష చేయడానికి ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. నోటి ద్వారా స్కోప్ ని పంపించి లోపలి భాగాలను పరీక్షిస్తారు. జీర్ణాశయంలో అల్సర్లు, క్యాన్సర్లు, ఇతర గడ్డలు ఇందులో బయటపడతాయి.

Gastric Problem : తరచుగా గ్యాస్ సమస్య బాధిస్తుందా ?… ఈ పరీక్షలు చేయించుకోండి

Home Remedies

Gastric Problem : ఆధునిక జీవనశైలి మన అలవాట్లు, ఆహారాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు మన ఆరోగ్యంపై చాలా రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. వేళ తప్పి తీసుకునే ఆహారం, నిద్ర సమయాలు మారడం, తగినంత నిద్ర లేకపోవడం మన జీర్ణ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి.

READ ALSO : Paddy Cultivation : ముదురు వరి నారు వేసేటప్పుడు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అందుకే ఎవరిని కదిలించినా అయితే అసిడిటీ సమస్య లేకుంటే మలబద్ధకం.. అన్నట్టుగా అవస్థలు పడుతున్నారు. అయితే, కొన్నిసార్లు చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే మరింత జటిలం కావొచ్చు. పెను ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చు. అందుకే గ్యాస్ సమస్యలు ఉన్నవాళ్లు తరచుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు.

లిపిడ్ప్రొఫైల్

ఈ పరీక్ష ద్వారా రకంతంలో కొలెస్ట్రాల్ స్థాయి తెలుసుకోవచ్చు. ఇందులో హెచ్ డీ ఎల్, ఎల్ డీ ఎల్, టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉన్నాయో తెలుస్తుంది. వీటిలో మార్పులుంటే వెంటనే జాగ్రత్తపడొచ్చు. అవసరమైన మెడికేషన్ వాడొచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే గుండెకు మంచిది కాదు.

READ ALSO : Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు

సీబీపీ

కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా సీబీపీ పరీక్ష ద్వారా రక్తం గురించిన వివరాలు తెలుస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్లు తగినంత ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.

లివర్ ఫంక్షన్ టెస్ట్

కాలేయం పనితీరు తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. వాంతులు, వాంతిలో రక్తం పడటం లేదా రక్తపు వాంతులు, విరేచనాలు, విరేచనంలో రక్తం, కామెర్లు వంటి లక్షణాలున్నప్పుడు లివర్ లో సమస్య ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇలాంటప్పుడు ఈ పరీక్ష అవసరం అవుతుంది.

READ ALSO : New Kia Sonet Launch : 2024లో కొత్త కియా సోనెట్ కారు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

సీరమ్ క్రియాటిన్, ప్రొటీన్ టెస్ట్

కిడ్నీ సక్రమంగా పనిచేస్తుందా లేదా, ఏమైనా సమస్యలున్నాయా అనేది తెలుసుకోవడానికి ఈ రెండు పరీక్షలు చేయించుకోవాలి.

అల్ట్రాసౌండ్ స్కానింగ్

పొత్తికడుపుకి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లుంటే తెలుస్తుంది. కడుపు నొప్పి, కామెర్లు, ఉన్నప్పుడు చేయించుకోవాలి.

READ ALSO : Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్.. పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

ఎండోస్కోపీ

జీర్ణవ్యవస్థ పై భాగాన్ని పరీక్ష చేయడానికి ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. నోటి ద్వారా స్కోప్ ని పంపించి లోపలి భాగాలను పరీక్షిస్తారు. జీర్ణాశయంలో అల్సర్లు, క్యాన్సర్లు, ఇతర గడ్డలు ఇందులో బయటపడతాయి. కడుపులో తయారవుతున్న ఆమ్లాల పనితీరు కూడా ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు.

అకస్మాత్తుగా ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, విరేచనాలు, వాంతులు వంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని కలవాలి. అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకోవాలి. పైన చెప్పిన పరీక్షలు తరచుగా చేయించుకుంటూ ఉండటం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద జబ్బులను ముందుగానే స్క్రీనింగ్ చేయవచ్చు. ఇతరత్రా సమస్యలుంటే వాటికి వెంటనే చికిత్స తీసుకోగలుగుతాం.