Dark Chocolate : డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.

Dark Chocolate : డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

darkChocolate

Dark Chocolate : కిస్ మీ.. అంటూచాక్లెట్ మన నోరూరిస్తుంటుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే చాక్లెట్స్ అంటే ఇష్టముండనిదేవరికి చెప్పండి. అందులో డార్క్ చాక్లెట్ తింటే నోటికి రుచిగానే కాదు.. ఆరోగ్యానికి ప్రయోజనాలూ చేకూరుతాయి.

చాక్లెట్ తింటుంటే వద్దు అని పెద్దలు పిల్లలను హెచ్చరిస్తుంటారు. అదే పెద్దలు మాత్రం జిహ్వ ఆపుకోలేక లాగించేస్తుంటారు. అయితే మితంగా తింటే ఏదైనా మనకు మంచే చేస్తుందిఅని గుర్తు పెట్టుకోండి. క్రమం తప్పని వ్యాయామంతో పాటు రోజుకు కొంచెం డార్క్ చాక్లెట్ తింటే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకున్నవారవుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా ఏ విధంగా డార్క్ చాక్లెట్ మనల్ని రక్షిస్తుందో తెలుసుకోండి.

READ ALSO : Green Gram Dal : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు !

గుండె ఆరోగ్యం :

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే డార్క్ చాక్లెట్ ని క్రమం తప్పకుండా తినండి.

మూడ్ మారడానికి..

ఒంట్లో, మనసు చికాకుగా అనిపిస్తుందా? అయితే డార్క్ చాక్లెట్ కాస్త తిని చూడండి. కచ్చితంగా మానసిక స్థితి పై సానుకూల ప్రభావం ఉంటుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఎండార్ఫిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ హార్మోన్లను ‘ఫీల్ గుడ్’ హార్మోన్లుగా పిలుస్తారు. అంతేకాదు.. చాక్లెట్స్లోసెరోటోనిన్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ మూడ్ ను మారుస్తుంది.

READ ALSO :  kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

మెదడు ఆరోగ్యం :

డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల జ్యాపకశక్తి, అన్ని పనుల మీద శ్రద్ధ పెరుగుతుంది. అలాగే సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా ఈ చాక్లెట్స్ కాపాడుతాయి.

చర్మ సంరక్షణ :

డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. వీటిని తినడం చేసినా, లేదా ఫేస్ ప్యాక్ లా వాడినా కూడా చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఇందులో ఉండే కెఫైన్ మృతకణాలను తొలగించేందుకు బాగా పని చేస్తుంది. అలాగే చర్మంలోని తేమను అలాగే ఉంచేలా చేస్తుంది.

READ ALSO : ఎముకలు, కండరాలకు మేలు చేసే చికెన్ లివర్

డయాబెటిస్ తగ్గేందుకు :

డార్క్ చాక్లెట్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్సెన్సిటివిటీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే మితంగా తీసుకున్నప్పుడే ఇలాంటి ఫలితాలను పొందవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించాలంటే డార్క్ చాక్లెట్ బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మధుమేహం ఉన్న వ్యక్తులు వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోండి.

70శాతం కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్ ఉన్నప్పుడే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అధిక కోకోలో తక్కువ చక్కెర నిల్వలు ఉంటాయి కాబట్టే డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఏవైనా సరే మితంగా తినడం మాత్రం మరవద్దు.