ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..నిర్మాణ పనులపై నిషేధం

  • Published By: venkaiahnaidu ,Published On : November 1, 2019 / 07:53 AM IST
ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ..నిర్మాణ పనులపై నిషేధం

ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం పరిసరాల్లో ఎయిర్ క్వాలిటీ తీవ్రస్థాయిలో ఉన్నట్లు నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(NAQI),సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపింది. నోయిడాలో కూడా తీవ్రస్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఉన్నట్లు తెలిపింది.

దీంతో ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్(ప్రివెన్షన్ ఆర్ కంట్రోల్)అథారిటీ. అంతేకాకుండా నవంబర్ 5వరకు ఎటువంటి నిర్మాణా పనులు జరగకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా చలికాలంలో క్రకార్స్ కాల్చకుండా నిషేధం విధించింది. దీపావళి రోజు రాత్రి నుంచి ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే.