Walking Benefits: వ్యాయామం చేయలేకపోతున్నారా? కనీసం నడవండి.. పరిశోధనలో ఏం తేలిందంటే?

Walking Benefits: దాదాపు ఆరేళ్ల పాటు 20,152 మంది ప్రజల ఆరోగ్య వివరాలను నమోదుచేసుకున్నారు. వేగంగా నడవడం..

Walking Benefits: వ్యాయామం చేయలేకపోతున్నారా? కనీసం నడవండి.. పరిశోధనలో ఏం తేలిందంటే?

Updated On : December 28, 2023 / 7:25 PM IST

ఆరోగ్యం కోసం ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటాం. పోషకాహారానికి తోడు వ్యాయామం చేస్తే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కష్టపడి వ్యాయామం చేయాలంటే చాలా మంది బద్ధకిస్తారు. అటువంటి వారు తేలికైన వ్యాయామాలైనా చేయాలి. లేదంటే నడకపై దృష్టిపెట్టాలి. యువతకే కాదు.. వృద్ధులకు కూడా నడక వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

వాకింగ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాకింగ్ చేస్తే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. నడక వృద్ధులకూ చాలా మంచిదని, గుండెపోటు, స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజాగా పరిశోధకులు తేల్చారు.

ప్రతిరోజు ఒక మైలు (2,000 అడుగులు) నడిచే వారి కంటే ప్రతిరోజు 3 నుంచి 4 మైళ్లు నడిచే వృద్ధుల్లో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 40-50 శాతం తగ్గుతుందని చెప్పారు. అమెరికా హార్ట్ అసోసియేషన్ కు చెందిన సర్క్యులేషన్ జర్నల్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతంలో 20,152 మంది ప్రజలకు (అందరూ 18 ఏళ్లు-అంతకంటే ఎక్కువ వయసున్న వారు) సంబంధించి జరిగిన ఎనిమిది అధ్యయనాల సమాచారాన్ని తీసుకుని పరిశోధకులు తాజాగా ఈ వివరాలను తెలిపారు.

దాదాపు ఆరేళ్ల పాటు 20,152 మంది ప్రజల ఆరోగ్య వివరాలను నమోదుచేసుకున్నారు. వేగంగా నడవడం వల్ల అదనపు ఫలితాలు ఏమీ ఉండబోవని కూడా తేల్చారు. అయితే, గతంలో ప్రచురితమైన ఓ పరిశోధన ఫలితాల్లో కూడా దీనికి సంబంధించి ఓ అంశాన్ని పేర్కొన్నారు. వేగంగా నడవడం వల్ల అనారోగ్యాల ముప్పు తగ్గుందని చెప్పారు.