కరోనా భయం…సెక్స్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిందే

కరోనా భయం…సెక్స్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిందే

Worried About Coronavirus While Having Romance Wear Mask Says New Study 3392

కరోనా తెచ్చిన కష్టంతో సోషల్ డిస్టెన్స్ పాటిండం..మాస్క్ ధరించడం..తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం…ఇతరులకు ఆరు అడుగుల దూరం పాటించడం వంటి గైడ్ లైన్స్ అన్నీ దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు అందరూ ఈ గైడ్ లైన్స్ ను పాటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సెక్స్ లేదా శృంగారంలో పాల్గొనేవాళ్లు కూడా కొన్ని కొత్త నిబంధన పాటించాలంటుని ఓ కొత్త అధ్యయనం చెబుతోంది.

సెక్స్ లేదా శృంగారంలో పాల్గొన్న సమయంలో వైరస్ సంక్రమణను నివారించడానికి భాగస్వాములు మాస్క్ ధరించాలని,ముద్దులు పెట్టుకోవడం వంటివి మానేయాలని అధ్యయనం తెలిపింది. అనేక లైంగిక చర్యలలో కరోనా వైరస్ సంక్రమణ సంభావ్యతను పరిశీలించిన ముగ్గురు హార్వర్డ్ వైద్యులు ఈ విషయాన్ని సృష్టం చేశారు. సెక్స్ చేసేటప్పుడు లేదా పాల్గొన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని,ముద్దులు పెట్టుకోవడం చేయకూడదని తెలిపారు.

వైరస్ సంక్రమణను నివారించడానికి…సెక్సువల్ పార్టనర్స్ సంఖ్యను ప్రజలు తగ్గించుకోవాలని,జ్వరం,దగ్గు,ఆయాసం, వాససను కోల్పోవడం వంటి కోవిడ్-19 లక్షణాలు ఉన్నవాళ్లతో సెక్స్ లో పాల్గొనకపోవడమే చాలామంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా తమ ఇళ్లల్లో కాకుండా బయట సెక్స్ లో పాల్గొనేవాళ్లు సెక్స్ కు ముందు తర్వాత తలస్నానం లేదా షవర్ చేయాలని తెలిపారు. సెక్స్ చేసిన తర్వాత వైరస్ సంక్రమణను తగ్గించేందుకు ఆ భాగాలను సబ్బు లేదా ఆల్కహాల్ తో తుడవాలని తెలిపారు.

కలసికట్టుగా ఐసొలేట్ అయిన భాగస్వాముల మధ్య సెక్స్ కొంచెం ప్రమాదాన్నే సూచిస్తుంది..ఎందుకంటే వాళ్లు ఉన్న ఇంట్లో నుంచి ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్తే వాళ్లకు వైరస్ సోకే ప్రమాదముంది. ఈ పరిస్థితిలో భాగస్వాములకు మాస్క్  ను తాము రికమండ్ చేయడం లేదని రీసెర్చర్లు తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తికి సెక్స్ ఏ విధంగా సహాయపడగలదు?
కరోనావైరస్… లైంగిక ప్రసారం గురించి కఠినంగా అధ్యయనం చేయబడలేదు. కాని ఇది దగ్గు, తుమ్ము మరియు ఉమ్మి వంటి బిందువుల ద్వారా వ్యాపించే అత్యంత అంటుకొనే శ్వాసకోశ అనారోగ్యమని మనకు తెలిసిన విషయమే. ఈ సిఫారసుల యొక్క లైంగిక ఆరోగ్య చిక్కులు తక్కువ అటెన్షన్ పొందాయి. అయినప్పటికీ అన్ని రకాల వ్యక్తి లైంగిక సంబంధాలతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో నివాసి మరియు స్టడీ లేదా అధ్యయనాన్ని లీడ్ చేసిన డాక్టర్ జాక్ తుర్బాన్ తెలిపారు.

సెక్స్ కారణంగా భాగస్వాములు దగ్గరగా ఉంటారని,కాబట్టి భాగస్వాములు ఆ బిందువులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటివరకు 35శాతం మంది కరోనా పేషెంట్లు రోగ లక్షణాలు లేనివాళ్లు(asymptomatic), సెక్స్… సంక్రమణకు ప్రధాన పరిస్థితులను అందిస్తుందని తెలిపారు.