Cigarette affect : ఒక్క సిగరెట్..18 మందికి కరోనా అంటించేసింది..! 

ఒకే ఒక్క సిగిరెట్ 18మందికి కరోనా అంటించేసింది. ఈ కరోనా కాలంలో సామాజిక దూరం పాటించమని చెబుతుంటే ఓ వ్యక్తి చేసిన తప్పుకు కొంతమంది శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్ వల్ల... 18 మందికి కరోనా మహమ్మారి పాకిపోయింది.

Cigarette affect : ఒక్క సిగరెట్..18 మందికి కరోనా అంటించేసింది..! 

18 People Get Affected Covid Positive

18 people get affected covid positive : ఒకరు చేసిన తప్పో..లేదా పొరపాటో ఏది ఏమైనా ఒకే ఒక్క సిగిరెట్ 18మందికి కరోనా అంటించేసింది. ఈ కరోనా కాలంలో సామాజిక దూరం పాటించమని చెబుతుంటే ఓ వ్యక్తి చేసిన తప్పుకు కొంతమంది శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్ వల్ల… 18 మందికి కరోనా మహమ్మారి పాకిపోయింది హైదరాబాద్‌లో. శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి ఓ కంపెనీలో మార్కెంటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్లాడు. వెళ్తూ… వెళ్తూ…ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు పక్కనే ఉన్న పార్క్ దగ్గర ఆగాడు. జాలీగా ఓ సిగిరెట్ కాల్చాలనిపించింది.కానీ జేబులో అగ్గిపెట్టె లేదు. చుట్టు పక్కల చూశాడు. దూరంగా ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించాడు. అంతే దగ్గరకెళ్లి మ్యాచ్ బాక్స్ ఉందా అని అడకుండా..‘‘సార్..ఓసారి మీ సిగరెట్ ఇస్తారా… నేను సిగరెట్ అంటించుకుని ఇచ్చేస్తాను” అని అడిగాడు. దానికా పెద్ద మనిషి ‘హా దాందేముంది సార్..తీసుకోండీ సార్..దాందేముంది” అంటూ ఇచ్చాడు. అలా తన సిగరెట్ అంటించుకున్న మేనేజర్… దాన్ని కాల్చుకుంటూ…పొగను రింగు రింగులుగా వదులుతూ తాను వచ్చిన పని చూసుకోవటానికి వెళ్లిపోయాడు. అప్పటి వరకూ బాగానే ఉంది.

కానీ..ఆతరువాత మూడు రోజుల తర్వాత జ్వరం, ఒంటి నొప్పులు మొదలయ్యాయి. అంతకంతకూ తీవ్రత పెరిగింది. వెంటనే ఊపిరి ఆడట్లేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీటీస్కాన్‌ చేయించారు. ఇంకేముంది? కరోనా పాజిటివ్‌ అని తేలింది. అసలే పొగరాయుడు కావటంతో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. అతను మార్కెటింగ్‌ మేనేజర్ కాబట్టి..అదే విషయాన్ని తన టీం ఉంటున్న మొత్తం 20మంది మెంబర్స్ కు చెప్పాడు. దీంతో వాళ్లంతా అనుమానంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. 18 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంకేముంది? అందరూ ఐసోలేషన్ లో కెళ్లిపోయారు. ఆ 18 మంది నుంచి ఇంకెంత మందికి కరోనా సోకిందో చెప్పలేం. వాళ్లతో కాంటాక్ట్ అయినవాళ్లకు..వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ లు చేయిస్తుండగా మరి ఇంకా ఎన్ని పాజిటివ్ లు వస్తాయో తెలీకుండా ఉంది.

ఇలా తమ టీమ్ లో 18మందికి పాజిటివ్ రావటంతో మేనేజర్… తనకు కరోనా ఎలా సోకిందా? అని ఆలోచించగా..బాగా గుర్తు తెచ్చుకోవటానికి మరో సిగిరెట్ వెలిగించి..వారం నుంచి ఆయన ఎవరెవర్ని కలిశాడో గుర్తు తెచ్చుకుని డాక్టర్లకు చెప్పాడు. సిగరెట్ వెలిగించుకున్నప్పుడు ఓ వ్యక్తి దగ్గర సిగరెట్ తీసుకొని… వెలిగించుకున్నాని చెప్పటంతో డాక్టర్ ఇంకేముందీ? ఆ సిగిరెట్టే ఇంత ఘనకార్యం చేసిందని చెప్పటంతో షాక్ అయ్యాడు. చూశారా… ఒక్క సిగరెట్… ఎంత మందికి కరోనా వచ్చేలా చేసిందో…ఇంకా ఎంతమందికి రానుందో మరి..అదీ ఒక్క సిగిరెట్..18మందికి కరోనా కాదు కాదు మేనేజర్ తో కలిపి 19మందికి కరోనా అంటించేసింది.