సీఎల్పీ నేత ఎవరు : సిద్ధమౌతున్న కాంగ్రెస్ టీమ్

  • Edited By: madhu , January 15, 2019 / 09:30 AM IST
సీఎల్పీ నేత ఎవరు : సిద్ధమౌతున్న కాంగ్రెస్ టీమ్

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు 2019, జనవరి 17న ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తన టీమ్‌ని సిద్ధం చేసేందుకు సిద్ధమౌతోంది. జనవరి 16వ తేదీ బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పరిశీలకుడిగా రానున్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక జరగనుంది. సీఎల్పీ నేతగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసివస్తోంది. దీనికితోడు సామాజిక సమీకరణాలూ భట్టికే అనూకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 
దుద్దిళ్ల శ్రీధర్ బాబు..ఉత్తమ్…
మరో పేరు కూడా వినిపిస్తోంది. ఆయనే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. లోకసభ ఎన్నికల అనంతరం సీఎల్పీ నేతను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే భావనలో టీపీసీసీ ఉన్నట్లు టాక్. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే సీఎల్పీ నేతగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ రేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.