Hyderabad ORR : ముంబై, ఢిల్లీని తలదన్నేలా హైదరాబాద్.. ఇండియాలోనే సూపర్ సిటీగా మారనున్న భాగ్యనగరం

భాగ్యనగరాన్ని ముత్యాల నగరం అనేవారు. అటువంటి నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఓ ముత్యాల హారంలా మారింది. దీనికి రీజినల్ రింగ్ మరో మణిహారం తయారవుతోంది. అంతేకాదు అవుటర్ రింగ్ రైలు మార్గం పూర్తి అయితే హైదరాబాద్ నగరం దేశంలోనే మరో మెగా సూపర్ సిటీగా మారిపోతుంది.

Hyderabad ORR : ముంబై, ఢిల్లీని తలదన్నేలా హైదరాబాద్.. ఇండియాలోనే సూపర్ సిటీగా మారనున్న భాగ్యనగరం

Hyderabad Outer Ring Rail

Hyderabad Outer Ring Rail : గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad).. ఇంకొన్నేళ్లలో ఇండియా (India)లోనే సూపర్ సిటీ (Super city)గా మారిపోనుంది. ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai)ని తలదన్నేలా హైదరాబాద్ రూపుదిద్దుకోబోతోంది. కేంద్రప్రభుత్వం (central government) చేపట్టబోయే అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్టు(outer ring rail project) ఫౌండేషన్ పడితే.. మొత్తం నేషన్ అటెన్షన్ అంతా.. హైదరాబాద్ వైపు మళ్లుతుంది. అమెరికా (America)కు న్యూయార్క్ (New York) ఎలాగో.. ఇండియా (India) అంటే వెంటనే హైదరాబాద్  (Hyderabad) గుర్తొచ్చేలా మారిపోతుంది. ప్రపంచం (World) లో ఎక్కడ భారత్ పేరు చెప్పినా.. హైదరాబాద్ సిటీ ఒక్కటే కళ్ల ముందు మెదిలేలా.. మెగా సూపర్ సిటీ (Super city)తయారుకాబోతోంది. కేంద్రం చేపట్టబోయే అవుటర్ రింగ్ రైలుకు గనక అంకురార్పణ జరిగితే.. దేశం చూపు మొత్తం హైదరాబాద్ మీదకు మళ్లుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. ముత్యాల నగరం ఎలా మారిపోతుంది? సెంటర్ ప్రాజెక్ట్‌తో.. సిటీకి కలగబోయేదేంటో తెలుసుకుందాం..

సూపర్ సిటీగా మారనున్న భాగ్యనగరం..
హైదరాబాద్ అంటే.. 150 మీటర్ల కంటే ఎత్తులో ఉండి.. ఆకాశాన్ని తాకేంత బిల్డింగులు, అబ్బురపరిచే ఫ్లైఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్.. మోస్ట్ సేఫెస్ట్ సిటీ.. వీటికి మించి.. అద్భుతమైన లివబుల్ సిటీ. ప్రశాంతమైన నగరం. సౌతిండియాలోనే ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీ. ఇప్పటివరకు హైదరాబాద్ అంటే ఇదే. కానీ.. దీనికి డబుల్, ట్రిపుల్ రేంజులో హైదరాబాద్ది మారబోతోంది. కేవలం సౌతిండియాలోనే కాదు.. ఇండియా మొత్తానికి హైదరాబాద్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోంది. సూపర్ సిటీగా మారనుంది. ఊహకు కూడా అందనంతగా నగర రూపురేఖల్ని మార్చేందుకు కేంద్రం చేపట్టబోయే అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌తో.. బీజం పడబోతోంది.

KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

ఇప్పటికే.. భాగ్యనగరానికి ముత్యాల నగరమనే పేరుంది. ఇక్కడ మేలుజాతి ముత్యాలు దొరుకుతాయి. ఈ ముత్యాల నగరానికి.. ఔటర్ రింగ్ రోడ్డు ఓ ముత్యాల హారంలా మారింది. దీనికి తోడు.. రీజినల్ రింగ్ రోడ్డు రూపంలో మరో మణిహారం తయారవుతోంది. ఈ రెండింటికీ తోడుగా.. మహా నగరానికి మరింత కనెక్టివిటీ పెంచేలా.. గ్రేటర్ సిటీని సూపర్ సిటీగా మార్చేలా.. రీజినల్ రింగ్ రైల్ రూపంలో మరో ప్రాజెక్ట్‌కు కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. హైదరాబాద్ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా.. అవుటర్ రింగ్ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఇది గనక పూర్తయితే.. హైదరాబాద్ నగరం దేశంలోనే మరో మెగా సూపర్ సిటీగా మారిపోతుంది. ఇప్పటికే.. ఈ అవుటర్ రింగ్ రైలు మార్గంపై సర్వే చేపట్టేందుకు, డీపీఆర్ రూపకల్పనకు.. రైల్వే శాఖ 13 కోట్ల 95 లక్షలను కేటాయించింది.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్‌..
మొత్తం 26 వేల కోట్ల అంచనా వ్యయంతో.. ఈ అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్‌ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపడుతోంది కేంద్రం. ఇది కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు చుట్టుపక్కల 30 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో.. కొత్త జంక్షన్లు ఏర్పాటవుతాయి. వీటికి సమీపంలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు.. సిటీకి రాకపోకలు సాగించేందుకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పటికే.. ప్రతిష్ఠాత్మకమైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దానికి సమాంతరంగా వచ్చే అవుటర్ రింగ్ రైలుతో.. హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సిటీ స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడున్న నగరానికి.. నలుమూలలా.. అభివృద్ధి వేగంగా విస్తరిస్తుంది. ముంబై, ఢిల్లీని తలదన్నేలా.. ఇండియాలోని అన్ని మెట్రో సిటీలకు మించిన బాబు లాంటి సిటీ ఏర్పడుతుంది.

అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ తో నగర పరిధి ప్రాంతాలకు కనెక్టివిటీ..
ఇప్పటికే.. హైదరాబాద్ చుట్టుపక్కల 50 నుంచి 60 కిలోమీటర్ల మేర నివాస యోగ్యమైన స్థలాలున్నాయి. ఈ అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ గనక పూర్తయితే.. అక్కడి వరకు ప్రజలకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. నగరంలోకి రావడానికైనా.. వాళ్లున్న చోటు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. రైల్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులతో పాటు రవాణా రంగంలోనూ ఊహించని మార్పులు వస్తాయి. ఎందుకంటే.. దేశంలో అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో.. తెలంగాణే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర జనాభాలో.. 53 శాతం మంది ప్రజలు.. పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ పూర్తయి.. జనానికి అందుబాటులోకి వస్తే.. కొన్ని లక్షల మంది ఈ సూపర్ సిటీలోనే నివసించేందుకు మొగ్గు చూపుతారు. అలాంటి వాళ్లందరికీ అనుగుణంగా.. హైదరాబాద్‌కు అనుసంధానంగా.. కొత్త నగరం రూపుదిద్దుకుంటుంది. లక్షలాది మంది ప్రజలకు తగ్గట్లుగానే.. మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి.

Uppal Sky Walk : ఉప్పల్ స్కై వాక్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకతలు ఇవే..

వేలాది మంది ఉపాధి అవకాశాలు..
ఇప్పటికే.. హైదరాబాద్ బిజినెస్‌కు, ఐటీ రంగానికి కేరాఫ్‌గా మారిపోయింది. అందుకు తగ్గట్లుగానే.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయ్. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలు, డేటా సెంటర్ల ఏర్పాటుతో.. సిటీ శివారు ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సిటీకి చేరువలో.. రింగ్ రోడ్డు చుట్టూ లాజిస్టిక్ హబ్స్ కూడా వస్తున్నాయ్. దీనికి తోడు.. అవుటర్ రింగ్ రైలు కూడా వస్తే.. హైదరాబాద్ అభివృద్ధికి ఒక బూమ్ వచ్చినట్లవుతుంది. ముంబై, బెంగళూరు హైవేలకు దగ్గరగా.. ఈ రైలు మార్గం ఉండటం వల్ల.. లాజిస్టిక్స్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. సిటీలోకి ఏం తీసుకురావాలన్నా.. ఈ అవుటర్ రింగ్ రైలు మార్గం ద్వారా చాలా ఈజీ అవుతుంది. ఫలితంగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా.. వేలాది మంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.

న్యూయార్క్‌ని మరిపించేలా.. హైదరాబాద్ డెవలప్‌మెంట్
నగరం పెరిగితే.. జనాభా కూడా పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా.. మౌలిక వసతులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయ్. అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో.. సిటీకి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. వ్యాపారంతో పాటు వాణిజ్యం కూడా ఊహించని స్థాయికి చేరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. హైదరాబాద్ దశే తిరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఊహించని విధంగా.. గ్రేటర్ సిటీ కాస్తా.. సూపర్ సిటీగా మారిపోతుంది. అమెరికాను తలపించే ఆకాశహార్మ్యాలు వస్తాయ్. న్యూయార్క్‌ని మరిపించేలా.. హైదరాబాద్ డెవలప్‌మెంట్ జరగబోతోంది.