Uppal Sky Walk : ఉప్పల్ స్కై వాక్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకతలు ఇవే..

భాగ్యనగరానికి మరో మణిహారం.అదే ఉప్పల్ స్కైవాక్. మంత్రి కేటీఆర్ చేతులుమీదుగా ప్రారంభమైంది. దాదాపు రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్ నిర్మాణం ఉప్పల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉప్పల్‌ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ స్కైవాక్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

Uppal Sky Walk : ఉప్పల్ స్కై వాక్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకతలు ఇవే..

Minister KTR to inaugurate Uppal Skywalk

Uppal Sky Walk – KTR : భాగ్యనగరానికి మరో మణిహారం వచ్చి చేరింది. అదే ఉప్పల్ స్కైవాక్. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైంది. దాదాపు రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్ నిర్మాణం ఉప్పల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉప్పల్‌ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ స్కైవాక్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టటమే కాకుండా చక్కటి నిర్మాణంతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది దేశంలోనే అత్యంత పొడవైన స్కైవాక్ కావటం మరో విశేషం.

1000 టన్నుల స్టీల్ ను ఉపయోగించి నిర్మించిన ఈ స్కైవాక్ లో 8 లిప్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కలేటర్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాక ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. కానీ రోజు రోజుకు పెరుగుతున్న నగర జనాభాకు ఈ రైళ్లు సరిపోవటంలేదనే చెప్పాలి. రోడ్డుకు 30 అడుగుల ఎత్తులో మెట్రో రైళ్లు దూసుకుపోతున్నాయి. ఉప్పల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. పాదచారులు రోడ్డు దాటడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాదచారులు రోడ్డే దాటే క్రమంలో చాలాసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. నడిచేవారు అడ్డుగా వస్తుండడంతో వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతుంటాయి. ఫలితంగా ట్రాఫిక్ స్తంభిస్తుంటుంది. ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చటానికి నిర్మించిన ఈ స్కై వాక్ అందుబాటులోకి వచ్చింది. మెట్రోరైలు ట్రాక్ నిర్మాణానికి ఇంచుమించు అదే ఎత్తులో సరికొత్తగా రూపుదిద్దుకుంది ఈ స్కైవాక్ బ్రిడ్జ్. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. మరి ఈ స్కైవాక్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

Telangana Lulu Group : తెలంగాణలో లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

ఈ స్కైవాక్ పై నడుస్తుంటే చక్కటి అనుభూతి కలుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీని చుట్టు సేఫ్టీ విత్ స్టైల్ వాల్స్ .. అండ్‌ సేఫ్టీ వాక్‌.. దానిపై నడుస్తుంటే పచ్చని చెట్టు కనిపిస్తు కనువిందు చేస్తాయి. ఆకాశ వీధిలో అందమైన పచ్చటి చెట్ల అలంకరణతో.. నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ట్రాఫిక్ సౌండ్ లు కూడా పెద్దగా వినిపించవు. చక్కగా ప్రశాంతంగా నడుచుకుంటు వెళ్లొచ్చు. ఏ వాహనం ఎటునుంచి వస్తుందోనని అటు ఇటు చూసుకుంటు నడవాల్సిన పనిలేదు. హాయిగా ప్రశాంతంగా నడుచుకుంటు ఎంజాయ్ చేస్తు వెళ్లొచ్చు. పైగా స్కై వాక్‌ చేస్తూ.. కింద స్పీడుగా వెళ్లే వెహికల్స్‌ను ఏరియల్‌ వ్యూలా చూస్తూ నడుస్తుంటే ఆ అనుభూతే వేరయా అన్నట్లుగా ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చేపట్టిన ఉప్పల్‌ రింగ్‌ రోడ్డులో దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను సిద్ధమైంది. 660 మీటర్ల పొడవుతో రూ. 25 కోట్లతో స్కై వాక్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. 33 పిల్లర్లు, 6 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు.. కనువిందు చేసే లైంటింగ్ నిర్మాణం వావ్ అనిపిస్తోంది. స్కై వాక్ పై నిఘా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్‌ చేస్తూ ఉంటాయి. ఇరువైపులా రక్షణ కోసం రెయిలింగ్ సెట్ చేశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ స్కైవాక్ సొంతంగా ఉంది. మరి ఈ అందాల స్కైవాక్ బ్రిడ్జ్ అందాలు వీక్షించాలంటూ ఈ డ్రోన్ విజువల్ పై ఓ లుక్కేయండీ..

ఉప్పల్‌ జంక్షన్‌ స్కై వాక్‌ బ్రిడ్జ్ విశేషాలు
స్కైవాక్‌ మొత్తం పొడవు 640 మీటర్లు
వెడల్పు -వర్టికల్‌ వెడల్పు- 3, 4,6 మీటర్లు
ఎత్తు -6 మీటర్లు
8 లిఫ్ట్‌, 4 ఎస్కలేటర్స్‌, మెట్ల సౌకర్యం
ఆరు చోట్ల ఎగ్జిట్‌, ఎంట్రీ పాయింట్స్‌
రూ.25 కోట్లు ఖర్చు..
1000 టన్నులు పైగా స్టీల్ వినియోగం
బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైన రూఫ్ కవరింగ్

Telangana Leaders: ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ నేతలు.. హస్తిన పరిణామాలపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ