Telangana Lulu Group : తెలంగాణలో లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో లులు గ్రూప్ Rs.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫుడ్ ఫ్రాజెసింగ్ యూనిట్ ను లులూ గ్రూప్ తెలంగాణలో ఏర్పాటు చేయనుంది.

Telangana Lulu Group : తెలంగాణలో లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

Lulu Group to invest in Telangana

Lulu Group to invest in Telangana : తెలంగాణ ( Telangana)లో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది.తెలంగాణలో లులు గ్రూప్ (Lulu Group)రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫుడ్ ఫ్రాజెసింగ్ యూనిట్ (Food phrasing unit)ను లులూ గ్రూప్ (Lulu Group)తెలంగాణ ( Telangana)లో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో దశలవారీగా రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టటానికి ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా బేగంపేట్ ( Begumpet)లోని ఐటిసి కాకతీయ హోటల్ (ITC Kakatiya Hotel)లో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(minister KTR) లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ(Lulu Group Chairman Yusuf Ali)తో తో సమావేశమయ్యారు.

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర వన్ : కేటీఆర్
పెట్టుబడులు ఒప్పందంలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర వన్ గా ఉందని..సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అని తెలిపారు. ఇండియాలోనే అతి పెద్ద ఆక్వా హబ్ గా తెలంగాణ సిద్ధమవుతోందన్నారు. తెలంగాణలో హరిత విప్లవం, నీలి విప్లవం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థ  లులూ గ్రూప్ హైదరాబాద్ (Hyderabad)లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు తోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతోందని అన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు (Irrigation project)తెలంగాణ రాష్ట్రంలోనే ఉందదనీ..త్రివేండ్ రెవల్యూషన్ వై ట్రివల్యూషన్ థింక్ రెవల్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుందని తెలిపారు.

Telangana : రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు, ఈసారి 70లక్షల మంది..

రూ.300 కోట్లతో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఏర్పాటు..
తెలంగాణలో లులూ గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ పోర్టు (Food Processing and Export)కేంద్రాన్ని రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని..రూ.300 కోట్లతో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నామని లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లలో షాపింగ్ మాల్ (Shopping mall)ప్రారంభించనున్నామని తెలిపారు.ఇప్పటికే లులూ మాల్ కు సంబంధించి 80% పని పూర్తి అయిందని వెల్లడించారు.తెలంగాణ నుంచి బియ్యాన్ని సేకరించబోతున్నామని..తెలంగాణ లో మీట్ ప్రోసెసింగ్ యూనిట్ (Meat Processing Unit), ఫిష్ ప్రోస్సేసింగ్ యనిట్ (Fish Processing Unit)ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. దావోస్ (Davos )లో అందుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నామని లులూ గ్రూప్ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు.