హ్యాపీగా జీవించవచ్చు : భారత్ లో నివాస అనుకూల నగరాల్లో హైదరాబాద్ నెం.1

  • Published By: venkaiahnaidu ,Published On : March 14, 2019 / 10:58 AM IST
హ్యాపీగా జీవించవచ్చు : భారత్ లో నివాస అనుకూల నగరాల్లో హైదరాబాద్ నెం.1

భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్  చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది.

మెర్సర్స్ యాన్యువల్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2019 ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్, మహారాష్ట్రలోని ఫుణె నగరాలు 143వ ర్యాంక్ ని సాధించి.. భారత్ లో అత్యంత అనుకూలమైన నగరాలుగా మెదటి ర్యాంక్ ని సాధించాయి. 2018లో ఈ రెండు నగరాలు ప్రపంచవ్యాప్తంగా 142వ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది మాత్రం ఓ ర్యాంక్ కు దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాలు ఈ లిస్ట్ లో చోటు దక్కించుకోగా భారత్ నుంచి ఏడు సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి.

149వ ర్యాంక్ తో భారత్ లో 2వ స్థానంలో బెంగళూరు నిలవగా,162వ ర్యాంక్ తో 3వ స్థానాన్నిఢిల్లీ, 154వ ర్యాంక్ తో 4వ స్థానాన్ని ముంబై,160వ ర్యాంక్ తో 5వ స్థానంలో కోల్ కతా సిటీ నిలిచింది. హౌసింగ్, మానసిక విశ్రాంతి, రవాణా, రాజకీయ,సామాజిక వాతావరణం, నాచురల్ ఎన్విరాన్మెంట్, పబ్లిక్ సర్వీసెస్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, విద్య, వైద్యం, ఆరోగ్యం, సాంస్కృతిక ఎన్విరాన్మెంట్, వినియోగదారుల సరుకుల అందుబాటు తదితర అంశాల ఆధారంగా ఈ నగరాలను అత్యంత అనుకూలమైన నివాస నగరాలుగా ఎంపిక చేశారు.
Read Also : పేటీఎం యూజర్ల పెద్ద మనస్సు : అమర జవాన్లకు రూ.47కోట్లు విరాళం

ప్రపంచవ్యాప్తంగా నివాసానికి అనుకూలమైన నగరాల లిస్ట్ లో వరుసగా 10వసారి ఆస్ట్రియా రాజధాని వియన్నా నెం.1 స్థానాన్నిదక్కించుకుంది. స్విట్జర్లాండ్ లోని జూరిచ్ నగరం నెం.2 స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 143వ ర్యాంక్ తో భారత్ లో నెం.1 స్థానాన్ని హైదరాబాద్,పూణే నగరాలు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన నగరంగా లక్సంబర్గ్ సిటీ నిలిచింది.105వ స్థానంతో ఆసియా-పసిఫిక్ రీజియన్ లో  తమిళనాడు రాజధాని చెన్నై సురక్షితంగా నిలిచింది.

226వ స్థానంతో దక్షిణాసియాలో అత్యంత తక్కువ సేఫ్ సిటీగా కరాచీ సిటీ నిలిచింది. సురక్షితమైన నగరాల లిస్ట్ లో హైదరాబాద్ 109వ ర్యాంక్ దక్కించుకోగా, పూణే112వ ర్యాంక్, బెంగళూరు 116వ ర్యాంక్,కోల్ కతా 116వ ర్యాంక్, న్యూ ఢిల్లీ 138వ ర్యాంక్, ముంబై 144వ ర్యాంక్ ను దక్కించుకుంది. ఆయా నగరాల్లోని అంగర్గత స్థిరత్వం, నేరాల స్థాయి, వ్యక్తిగత స్వేచ్ఛపై హద్దులు, చట్టాల అమలు, మీడియా స్వేచ్ఛ, ఇతర దేశాలతో సంబంధాలు ఆధారంగా సురక్షితమైన నగరాల సర్వే చేపట్టిన మెర్సర్స్ భారత్ లో మొదటిస్థానాన్ని చెన్నైకి ఇచ్చింది. 

దేశవ్యాప్తంగా నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానాన్ని దక్కించుకోవడంపై నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ , అద్భుతమైన క్వాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్-రోడ్లు, ట్రాఫిక్,మెట్రో రైల్,విద్య వంటి అనేక అంశాలు హైదరాబాద్ ను దేశంలో నెం.1 స్థానంలో నిలబెట్టాయని అన్నారు.