అకాల వర్షాలు..రైతన్నలకు నష్టం

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 01:04 AM IST
అకాల వర్షాలు..రైతన్నలకు నష్టం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురస్తున్నాయి. దీని ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్, ఎడపల్లి మండలాల్లో భారీ ఈదురుగాలులు..భారీ వర్షం కురిసింది. ఫలితంగా కోత దశలో ఉన్న జొన్న, పసుపు, మొక్కజొన్న, నవ్వులు, ఉల్లి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కల్లాలపై ఆరబెట్టిన పంట నీటిపాలైంది. ధాన్యం మొత్తం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగిత్యా జిల్లాలోని మెట్ పల్లి డివిజన్‌లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలిపోయాయి. ప్రచార హోర్డింగ్‌లు సైతం నేలమట్టమయ్యాయి.