క్వారంటైన్ లో ఉన్న కరోనా పేషెంట్లపై నిఘా ఎలా పెడతారు? ఏపీ, తెలంగాణ వాడుతున్న టెక్నాలజీ ఏంటి?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 06:45 AM IST
క్వారంటైన్ లో ఉన్న కరోనా పేషెంట్లపై నిఘా ఎలా పెడతారు? ఏపీ, తెలంగాణ వాడుతున్న టెక్నాలజీ ఏంటి?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందించడం, క్వారంటైన్ లో ఉన్నవారిపై నిఘా ఉంచడం ప్రభుత్వాలకు పెద్ద సవాల్ గా మారింది. క్వారంటైన్ లో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు వస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా చూసుకోవడం పెద్ద చాలెంజ్. మరి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు క్వారంటైన్ లో ఉన్నవారిపై ఏ విధంగా నిఘా పెడుతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

ఫోన్ నెంబర్ ద్వారా సిగ్నల్ ట్రాక్:
ఆ వివరాల్లోకి వెళితే.. క్వారంటైన్‌లో ఉన్న కరోనావైరస్ పేషెంట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టెక్నాలజీ సాయంతో పర్యవేక్షిస్తున్నాయని తేలింది. క్వారంటైన్‌లో ఉన్న కరోనా వైరస్ పేషెంట్లు, అనుమానితులపై ప్రభుత్వాలు టెక్నాలజీ సహాయంతో నిఘా పెట్టాయట. కొన్ని రాష్ట్రాలు ఫోన్ నెంబర్ ద్వారా సిగ్నల్ ట్రాక్ చేస్తుంటే, మరి కొన్ని రాష్ట్రాలు వారిని ప్రతి గంటకి ఒక సెల్ఫీ పంపాలని సూచిస్తున్నాయి. ఈ రెండూ సాధ్యంకాని పక్షంలో దగ్గరలోని పోలీసులు కానీ, ఆరోగ్య సేవ కార్యకర్తలు కానీ వారి ఇళ్ళకు పంపి పరిశీలించమని చెబుతున్నారు.

జియో లొకేషన్ ద్వారా నిఘా:
అయితే టెక్నాలజీతో ఎలా ట్రాక్ చేస్తున్నారు? ఎంత మందిని ఇలా ట్రాక్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా క్వారంటైన్ ఉల్లంఘిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?  అనే వివరాల్లోకి వెళితే.. లంగాణలో 25వేల మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వారందిరినీ జియో లొకేషన్… అంటే వారి ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్‌ని కోవిడ్ 19 యాప్‌ ద్వారా ట్రాక్ చేస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆరోగ్య ఆంధ్ర అనే ఒక యాప్ ద్వారా ఇలా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి వివరాలు తీసుకొని ట్రాక్ చేస్తునట్లు అధికారులు తెలిపారు.

జియో ట్యాగ్ చేసి కదలికలు గమనింపు:
“టెక్నాలజీ కంటే కూడా, ముందు నుంచీ విదేశాల నుంచి వచ్చిన వారు, ఇప్పుడు ఢిల్లీ నుంచి వారిని గుర్తించి, వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, వారి ఆరోగ్య లక్షణాలను గమనిస్తూ, అవసరమైన దగ్గర ఉన్నతాధికారులకు తెలియ చేస్తూ తోడ్పడింది గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు. అయితే కొంతమంది దొరక్కుండా తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారు. అలాంటి వారి వివరాలు తీసుకుని వారి మొబైల్ ఫోన్‌ని జియో ట్యాగ్ చేసి వారి కదలికల్ని గమనిస్తూ ఉన్నాం. క్వారంటైన్‌లో ఉన్న వారికి పాజిటివ్ అని తేలిన కేసులో వారి మొబైల్ కాల్ రికార్డ్స్ ట్రాక్ చేసి వారికి కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని ట్రేస్ చేశాం” అని ఏపీ సీఎం కార్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రక్రియ అంతా కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.

జియో ట్యాగింగ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు?
“జియో ట్యాగింగ్ పలు పద్ధతుల్లో చేయవచ్చు. లొకేషన్ మాత్రమే సేకరించటం జరుగుతుంది. ఉదాహరణకు హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారి ఫోన్‌లో ఒక మొబైల్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసి, ప్రభుత్వ సర్వర్‌కి ఎప్పటికప్పుడు అతని లొకేషన్ కోఆర్డినెట్స్ పంపుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక పరిధి ఏర్పాటు చేసి దాని జియో ఫెన్సింగ్ చేసి పరిధి నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ నిర్ణిత పరిధి నుంచి కదిలి దూరంగా వెళ్తే దాన్ని కొలిచి ఆ వ్యక్తి ఉండాల్సిన ప్రదేశంలో లేడని అలర్ట్ చేస్తుంది. అయితే ఇది సాధ్య పడాలంటే మొబైల్ ఫోన్ లొకేషన్ సెట్టింగ్స్ ఆన్‌లో ఉంచాలి. ఒక వేళ ఎవరైనా ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్తే ఈ ట్రాకింగ్ చేయటం సాధ్య పడదు”.

మిగతా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
కర్ణాటక ప్రభుత్వం ప్రతి గంటకి ఒక సారి క్వారంటైన్‌లో ఉన్న వారు సెల్ఫీ దిగి క్వారంటైన్ వాచ్ అన్న యాప్‌లో పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు ఇంట్లోనే ఉన్నారా లేక మరెక్కడైనా ఉన్నారా అన్నది ఆ ఫోటోలో లొకేషన్ ట్రాక్ చేస్తే తెలుస్తుందని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గురువారం నాడు ఆరోగ్య సేతు అన్న యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ బ్లూటూత్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాక్ చేసేందుకు, అలాగే సమాచారం అందించేందుకు కూడా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇలా సాంకేతికంగా నిఘా పెట్టడం సబబేనా?
అయితే క్వారంటైన్‌లో ఉండాల్సిన వారిపై ఇలా సాంకేతికంగా నిఘా పెట్టడంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. “ఎప్పుడైతే నిఘా అవసరం పడుతుందో, అప్పుడు గోప్యత ప్రశ్న వస్తుంది. నిజంగా ఇలాంటి తీవ్రమైన నిఘా అవసరమా అనేది కూడా ప్రశ్నే. ఇప్పటి పరిస్థితుల్లో క్వారంటైన్ లో ఉన్న వారిని సరిగా చూసుకుంటున్నామా, వారిలో లక్షణాలు పెరుగుతున్నాయా? అనేది తెలుసుకోవడానికి నిఘా కావాలి. అనుమానితులు బయట తిరగడం ద్వారా ఇతరులకు సోకకుండా చూడడానికి కూడా నిఘా కావాలి. ఇలాంటి సందర్బాల్లో ఒక ఆరోగ్య అవసరం శాంతి భద్రతల సమస్యగా ఎలా మారుతుంది?

ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానివ్వకుండా అక్కడే క్వారంటైన్ ఎందుకు చేయలేదు:
ఒక వ్యక్తి ఇంట్లో నుంచి రాకుండా చూడడానికి ఇంతకంటే సరళమైన మార్గాలున్నాయి. వ్యక్తి బయటకు వస్తే మోగేలా అలారంలు పెట్టొచ్చు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు తనతో పాటు ఫోన్ పట్టుకెళ్తేనే ఈ సాంకేతిక నిఘా వల్ల ఫలితం ఉంటుంది. అంతేకాదు, అందరికీ క్వారంటైన్‌కి తగిన ఇల్లుందనే భావనలో ఇది జరగుతోంది. ఈ క్వారంటైన్ ఖర్చు పౌరులు ఎందుకు భరించాలి? ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే, ఇప్పుడు అందరినీ క్వారంటైన్ లో పెట్టి 24 గంటలూ వారి యోగక్షేమాలు చూడగలిగే మౌలిక వసతులు ఉండి ఉండేవి. ఇప్పుడు కూడా ఈ సాంకేతిక నిఘా కోసం పెడుతున్న ఖర్చుతో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చవచ్చు. అసలు వారిని విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా అక్కడే క్వారంటైన్ ఎందుకు చేయలేకపోయారు?” అని సాంకేతిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.