Electric Buses : 2025నాటికి దేశంలో రోడ్లపైకి…. 10శాతం విద్యుత్ బస్సులు

కేంద్రప్రభుత్వ ఫేమ్ 2 పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస

Electric Buses : 2025నాటికి దేశంలో రోడ్లపైకి…. 10శాతం విద్యుత్ బస్సులు

E Bus

Electric Buses : భారత్ లో విద్యుత్ వాహనాల ట్రెండ్ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల తయారీ, అమ్మకాలపై ఇస్తున్న రాయితీల నేపధ్యంలో విద్యుత్ వాహనాల వ్యాపారం రోజురోజుకు పుంజుకుంటుంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఫేమ్ 2 పథకం గడువును 2024వరకు పొడిగించింది. ఈ క్రమంలో విద్యుత్ వాహానాల తయారీ రంగం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్ధలో కీలక భాగమైన బస్సులను విద్యుత్ తో నడిచే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు రానున్నరోజుల్లో సత్ఫలితాలు ఇవ్వనున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు.

ఏడాది కాలంలో విద్యుత్ బస్సుల కొనుగోళ్ళలో క్రమేపి పురోగతి కనిపిస్తుంది. కరోనా పరిస్ధితులు ఒకవైపు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్ళు కొనసాగుతుండం మంచిపరిణామంగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కొనుగోళ్ళు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనావేస్తున్నారు. 2025 దేశంలో సుమారు 10శాతం వరకు విద్యుత్తుతో నడిచే కొత్త బస్సులు రోడెక్కనున్నాయని రేటింగ్ సంస్ధ ఇక్రా అంచనావేసింది.

కేంద్రప్రభుత్వ ఫేమ్ 2 పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస్తుండటం శుభపరిణామంగా బావిస్తున్నారు. బస్సు వ్యయంలో 40 శాతం వరకు రాయితీ వర్తిస్తోందని, డీజిల్‌ వ్యయాలతో పోలిస్తే వీటిని 3-5 రెట్లు విద్యుత్ బస్సుల నిర్వాహణ తక్కువగా ఉండటంతో బస్సు యజమాన్యాలు విద్యుత్ బస్సుల కొనుగోళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.

రాయితీల వల్ల ఇ-బస్‌లకు మేలు కలుగుతుందగా, రానున్నరోజుల్లో దేశీయ తయారీ, విడిభాగాల లభ్యత సౌలభ్యం కావటం వల్ల వాహనాల ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా వీటి అమ్మకాలు పెరుగుతాయని ఇక్రా తెలిపింది. ఛార్జింగ్‌ సదుపాయాల కొరత, ఒకసారి ఛార్జింగుతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు, బస్సు ధరల వంటివి విద్యుత్ వాహనాల రంగం భవిష్యత్తు అధారపడి ఉంటుంది.