Pakistan drone: మరోసారి డ్రోను పంపి దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్

 సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో ఇవాళ ఉదయం డ్రోనును పంపి కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోను చక్కర్లు కొడుతూ కనపడడంతో సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో తోక ముడిచిన డ్రోను వెనక్కి వెళ్లిపోయింది. ఆ డ్రోను చక్కర్లు కొడుతున్న సమయంలో దాని శబ్దం కూడా వినపడిందని అధికారులు తెలిపారు.

Pakistan drone: మరోసారి డ్రోను పంపి దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్

Russia-ukraine war

Pakistan drone: సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో ఇవాళ ఉదయం డ్రోనును పంపి కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోను చక్కర్లు కొడుతూ కనపడడంతో సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో తోక ముడిచిన డ్రోను వెనక్కి వెళ్లిపోయింది. ఆ డ్రోను చక్కర్లు కొడుతున్న సమయంలో దాని శబ్దం కూడా వినపడిందని అధికారులు తెలిపారు.

ఆ డ్రోను సంచరిన ప్రాంతాల్లో మందుగుడు సామగ్రి, ఆయుధాలు, రెచ్చగొట్టే సాహిత్యం వంటివి ఏమైనా జారవిడిచిందా? అన్న విషయంపై బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల వద్దకు పాకిస్థాన్ డ్రోన్లను పంపుతున్న ఘటనలు పెరిగిపోయాయి.

రెండేళ్లుగా పాక్ ఈ చర్యలకు పాల్పడుతూ వేర్పాటు వాదులకు ఆయుధాలు, ఆహారం, డబ్బు వంటివి సరఫరా చేస్తోంది. పాకిస్థాన్ చర్యలపై అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఎప్పటికప్పుడు ఆ దేశ చర్యలను తిప్పికొడుతోంది. ఇప్పటికే ఎన్నో డ్రోన్లను భారత్ పేల్చి వేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

BJP slams ‘Adipurush’ director: ‘ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకోండి’.. ‘ఆదిపురుష్’లో రావణుడిని చూపిన తీరుపై బీజేపీ విమర్శలు