Corona : కరోనాను నిరోధించడానికి 6 అడుగుల దూరం చాలదు, ఆఫీసుల కన్నా ఇళ్లలోనే ప్రమాదం ఎక్కువ

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.

Corona : కరోనాను నిరోధించడానికి 6 అడుగుల దూరం చాలదు, ఆఫీసుల కన్నా ఇళ్లలోనే ప్రమాదం ఎక్కువ

Corona Virus

Corona Virus : కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలిగొంది. కాగా, మానవాళికి ముప్పుగా మారిన కరోనాను నియంత్రించడానికి నిపుణులు కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. అందులో మాస్కు ధరించడం, రెండు మీటర్ల దూరం పాటించడం ముఖ్యమైనవి. అయితే ఇలా రెండు మీటర్ల(ఆరున్నర అడుగులు) భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాప్తిని నిలువరించడం కష్టమని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

ఈ పరిశోధన ప్రకారం కరోనా పేషెంట్ ఉన్న ఇంట్లో అతని నుంచి వైరస్ చాలా వేగంగా చుట్టుపక్కల వారిని చేరుతుంది. కరోనా పేషెంట్ల శ్వాస, వారు మాట్లాడినా ఈ వైరస్ క్రిములు కేవలం నిమిషంలోనే ఇతరులను చేరుకుంటాయి. అదే ఆ ఇంట్లో వెంటిలేషన్ సదుపాయాలు సరిగా లేకపోతే ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.

కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

గాలి ద్వారా కరోనా సోకే ప్రమాదం ఆఫీసుల్లో కన్నా ఇళ్లలోనే ఎక్కువగా ఉందన్నది తమ పరిశోధనలో బయటపడిన షాకింగ్ అంశమని పరిశోధకులు తెలిపారు. అయితే సరైన వెంటిలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని వాళ్లు తెలిపారు. అలాగే వెంటిలేషన్, దూరం పాటించడం మాత్రమే కరోనా నుంచి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే సాధనాలని స్పష్టంచేశారు.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

భారత్ లో కొత్తగా 27వేల 176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 యాక్టివ్‌ కేసులున్నాయి. 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,43,497 మంది కరోనాతో చనిపోయారు. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 38,012 మంది కోలుకోగా, 284 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది. దీంతో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

దేశవ్యాప్తంగా మంగళవారం వరకు 54,60,55,796 నమూనాలకు పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 16,10,829 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.