Big Accident In Pakistan: కారును ఢీకొని లోయలో పడిన బస్సు.. 30 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్‌లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్‌ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది.

Big Accident In Pakistan: కారును ఢీకొని లోయలో పడిన బస్సు.. 30 మంది మృతి

Accident in Pakistan

Big Accident In Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్‌లోని గిల్గిత్ – బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్‌ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది. బస్సు గిల్గిత్ నుండి రావల్పిండికి వెళ్తుంది. బస్సు  కారును ఢీకొనడంతో రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య సేవలు అందుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Road Accident In Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి, మరికొందరికి గాయాలు

ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతులకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాదంపై ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ స్పందిస్తూ.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన మినీ బస్సు.. 22 మంది మృతి

పాకిస్థాన్‌లో ప్రతీయేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. గత నెలలో బలూచిస్తాన్‌లోని లాస్బెలాలో ప్యాసింజర్ కోచ్ లోయలోపడి దాదాపు 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న బస్సు లాస్బెలా సమీపంలోని వంతెన పిల్లర్ ను ఢీకొట్టడంతో లోయలో పడిపోయింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్యగా పెరిగింది.