Greece: గ్రీస్‌లో కూలిన విమానం.. మండుతోన్న అడవులు

అడవిలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఓ విమానం కుప్పకూలింది. గ్రీస్‌లో అగ్నిమాపక విమానం కూలిపోయింది

Greece: గ్రీస్‌లో కూలిన విమానం.. మండుతోన్న అడవులు

Flight

Aircraft Crashed: అడవిలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఓ విమానం కుప్పకూలింది. గ్రీస్‌లో అగ్నిమాపక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక సేవలకు సంబంధించిన విషయాన్ని ఊటంకిస్తూ AFP నివేదించింది. పశ్చిమ గ్రీస్‌లోని అయోనియన్ ద్వీపం జాకింతోస్‌లో మంటలను అదుపుచేసే సమయంలో విమానం కూలిపోయినట్లుగా చెబుతున్నారు.

గ్రీస్‌లో మూడు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా అత్యంత సుదీర్ఘమైన వేడి గాలులు వీస్తున్నాయి. అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మంటలు దేశంలోని వేలాది ఎకరాల భూమిలో చెలరేగడంతో, రోజుల తరబడి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ (113 ఎఫ్) వరకు పెరిగాయి. ఎముకలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏథెన్స్ శివార్లలో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు.

ఈ సమయంలోనే పశ్చిమ గ్రీస్‌లోని అయోనియన్ ద్వీపం జాకింతోస్‌లో మంటలను అదుపుచేసే సమయంలో పెజెటెల్ విమానం కూలిపోయింది. అయితే, పైలట్ సురక్షితంగా ఉన్నాడని, ఇతర అగ్నిమాపక సిబ్బంది సహాయం అందించినట్లుగా అధికారులు వెల్లడించారు. గ్రీస్‌, టర్కీ దాదాపు రెండు వారాలుగా అగ్ని ప్రమాదాలతో అల్లాడిపొతున్నాయి. ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్‌లో ఇద్దరు.. టర్కీలో ఎనిమిది మంది మరణించారు. డజన్ల కొద్దీ జనం ఆసుపత్రి పాలయ్యారు.

టర్కీలో వానలు కురవడంతో కాస్త ఉపశమనం లభించినా.. గ్రీస్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్‌లు రెండో అతిపెద్ద ద్వీపమైన ఎలివియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.